twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bappi Lahiri కన్నుమూత.. ఒకే ఒక రోజులో మహా విషాదం.. ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి

    |

    మ్యూజిక్ కంపోజర్, గాయకుడు, 80, 90 దశకాల్లో డిస్కో మ్యూజిక్‌తో యువతను ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం బప్పీలహరి ఇకలేరు. పలు రకాల అనారోగ్యా కారణాలతో ఆయన ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లో తదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సంగీత ప్రపంచం, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Bappi Lahiri The Disco King | India Remembers The Music Legend | Oneindia Telugu
    నెల రోజులుగా హాస్పిటల్‌లోనే

    నెల రోజులుగా హాస్పిటల్‌లోనే

    గతేడాది కరోనావైరస్ పాజిటివ్‌తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో బప్పిలహరి చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కోవిడ్ నుంచి బయట ఆరోగ్య వంతులయ్యారు. అయితే గత నెల రోజులగా మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను సిటికేర్ హాస్పిటల్‌లో చేర్పించారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో బప్పీ లహరిని ఫిబ్రవరి 15న అంటే మంగళవారం డిశ్చార్జ్ చేశారు. అయితే ఊహించని పరిస్థితుల్లో బప్పీ లహరి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున కన్నుమూశారు.

    సోమవారం డిశ్చార్జి.. అంతలోనే..

    సోమవారం డిశ్చార్జి.. అంతలోనే..

    బప్పీలహరి ఆరోగ్య పరిస్థితి గురించి క్రిటికేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నామ్‌జోషి మాట్లాడుతూ.. నెలరోజుల క్రితం అనారోగ్య పరిస్థితి కారణంగా హాస్పిటల్‌లో చేరారు. ఆయన పూర్తిగా కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశాం. కానీ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో డాక్టర్ వెళ్లి పరీక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మళ్లీ హాస్పిటల్‌కు తీసుకొచ్చాం. ఆయన పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధితో చనిపోయారు అని తెలిపారు.

     డిస్కో మ్యూజిక్‌తో సంచలనంగా

    డిస్కో మ్యూజిక్‌తో సంచలనంగా

    బప్పీ లహరి సినిమా జీవితం విషయానికి వస్తే.. నన్హా షికారి చిత్రంతో 1973లో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. 1976లో చల్తే చల్తే సినిమాతో బ్రేక్ లభించింది. 1982లో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ మూవీతో దేశవ్యాప్తంగా పామరుల నుంచి పండితుల వరకు తన మ్యూజిక్‌తో ఆకట్టుకొన్నారు. డిస్కో డ్యాన్సర్ తర్వాత తన సంగీతంతో దేశీయ సంగీతానికి చక్రవర్తిగా మారిపోయారు. నమక్ హలాల్, హిమ్మత్ వాలా, షరాబీ, సాహెబ్, గిరఫ్తార్, డ్యాన్స్ డ్యాన్స్, థానేదార్, ది డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన చివరిసారిగా హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ 3 చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

     సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి చిత్రాలకు..

    సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి చిత్రాలకు..

    తెలుగు ప్రేక్షకులకు బప్పీల హరి సుపరిచితుడు. సూపర్ స్టార్ కృష్ణ‌తో మంచి అనుబంధం ఉంది. అప్పట్లో కృష్ణ ప్యాన్ ఇండియా చిత్రంగా నిర్మించిన సింహాసనం సినిమాకు బప్పీలహరి సంగీత దర్శకుడు. ఆకాశంలో ఒక తార పాట ఇప్పటికి సినీ అభిమానులను ఉత్తేజ పరుస్తుంది. ఆ తర్వాత వరుసగా కృష్ణ నటించిన తేనే మనసులు, శంఖారావం, సమ్రాట్, ఇంద్రభవనం లాంటి చిత్రాలకు సంగీతం అందించారు. చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్‌బాస్, మోహన్ బాబు నటించిన రౌడీ గారి పెళ్లాం చిత్రాలకు సంగీతం అందించారు. ఇటీవల రవితేజ నటించిన డిస్కో రాజా ఆయనకు తెలుగులో చివరి చిత్రం.

    ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. సంతాపం

    ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. సంతాపం

    మ్యూజిక్ లెజెండ్ బప్పీ లహరి మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్‌లో ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. శ్రీ బప్పీ లహరి అందించిన మ్యూజిక్ విభిన్నమైనది. అనేక భావోద్వేగాలను తన మ్యూజిక్‌తో పలికించాడు. తరాలు మారినప్పటికి ఆయన సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. భౌతికంగా దూరమైనప్పటికీ.. తన సంగీతంతో ప్రజల మనుసులో చిరస్థాయిగా ఉంటారు. ఆయన మరణం నాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆయన కుటుంబానికి, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి. ఓం శాంతి అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

    English summary
    Prime minister Narendra modi condolances Bappi Lahiri death. He wrote in twitter that, Shri Bappi Lahiri Ji’s music was all encompassing, beautifully expressing diverse emotions. People across generations could relate to his works. His lively nature will be missed by everyone. Saddened by his demise. Condolences to his family and admirers. Om Shanti."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X