సంగీత దర్శకుడు బప్పిలహరికి తీవ్ర అస్వస్థత.. ముంబై హాస్పిటల్‌లో చేరిక
ప్రముఖ దర్శకుడు, గాయకుడు బప్పిలహరి అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరారు. ముంబైని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ 19 బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కొద్ది రోజులుగా బప్పిలహరి అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్నది అని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు.

బప్పిలహరి కోవిడ్ 19కి గురైన నేపథ్యంలో ఆయనను కలిసిన వారు, గత కొద్ది రోజులుగా ఆయన తో పనిచేసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తూ సురక్షిత ప్రమాణాలను తీసుకోవాలి అని ఆయన కుటుంబ సభ్యులు కోరారు.
80, 90 దశకంలో తన సంగీతంతో యువతను, సినీ, సంగీత అభిమానులను ఉర్రూతలూగించారు. పలు తెలుగు సినిమాలకు ఆయన సంగీతం అందించారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రతిష్టాత్మకంగా నటించి, నిర్మాతగా, దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టి రూపొందించిన సింహాసనం సినిమాకు బప్పిలహరి సంగీతం అందించిన విషయం తెలిసిందే. సింహాసనం ఆడియో అప్పట్లో సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











