రాజశేఖర్ కల్కి నుంచి మనసును హత్తుకునే సాంగ్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి'. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించగా ఆయన సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. పూజిత పొన్నాడ, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు, డి.ఎస్.రావు, అమిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా చిత్రంలోని 'ఎవరో ఎవరో' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యంలో సాఫ్ట్ మెలోడీ సాంగ్ గా పాట శ్రోతల మనసును హత్తుకుంటోంది. "ఎవరో ఎవరో ఎవరో అతగాడెవరో.. ఎపుడో ఎక్కడో తెలిసే గురుతతనెవరో వెతికేలోపే వెనకే నిలిచిందెవరో ఎదురై కలిసి నడకే కలిపిందెవరో" అంటూ సాగిపోతున్న ఈ పాటను హేమచంద్ర, శ్వేతా మోహన్ ఆలపించారు. పాటకు తగ్గట్టుగా శ్రవణ్ భరద్వాజ్ అందించిన ట్యూన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. చాలా కాలం తరువాత రాజశేఖర్ సినిమా నుంచి ఓ అద్భుతమైన సాంగ్ విన్న ఫీలింగ్ కలుగుతోంది.

Beautiful Melodious Song From Kalki movie

మరోవైపు ఇటీవలే కల్కి నుంచి విడుదలైన ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతోంది. ''నీ లోడు బండి ఆపేయ్‌రా.. వేడి మీద ఇంజినుంది దించేయ్‌రా'' అంటూ లారీ బాబులను గుర్తుచేస్తూ సాగిన ఈ సాంగ్ లో ఐటెం భామతో రెచ్చిపోయి చిందులేశాడు రాజశేఖర్. మొత్తానికి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. జూన్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 'కల్కి' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X