twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో రికార్డులు క్రియేట్ చేసిన పాటలివే: టాప్ -10లో మెగా హీరోలవే నాలుగు

    |

    2020 ప్రారంభంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన భారీ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో కాసుల వర్షం కురిసింది. ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్న సమయంలో కరోనా రూపంలో సినిమాలకు బ్రేక్ పడింది. దీంతో ఎనిమిదిన్నర నెలలుగా థియేటర్లు మూతపడే ఉన్నాయి. దీంతో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ వాటి ప్రభావం మాత్రం ఎక్కువగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లోని పాటలు టాలీవుడ్‌లో కొత్త చరిత్రను సృష్టించాయి. అందులో మెగా హీరోలవే ఎక్కువ ఉన్నాయి. ఇంతకీ ఆ పాటలు ఏమిటి? 2020 పూర్తవుతోన్న సందర్భంగా టాప్ -10 బెస్ట్ సాంగ్స్‌పై ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

    మొదటి రెండు స్థానాల్లో ఒకే సినిమా

    మొదటి రెండు స్థానాల్లో ఒకే సినిమా

    అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఇందులోని ‘బుట్టబొమ్మ' సాంగ్ ఈ ఏడాది ఉత్తమ పాటగా నిలిచింది. యూబ్యూట్‌లో దీనికి అత్యధికంగా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలోనూ ఈ సినిమాలోని ‘రాములో రాములా' పాటే ఉంది. దీనికి కూడా యూట్యూబ్‌లో విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

    యాంకర్ ప్రదీప్ పాటకు మూడో స్థానం

    యాంకర్ ప్రదీప్ పాటకు మూడో స్థానం

    బుల్లితెరపైన తనదైన శైలి యాంకరింగ్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. అతడు హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఇందులోని ‘నీలి నీలి ఆకాశం' పాట అత్యధిక వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. అమ‌ృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మున్నా తెరకెక్కించాడు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు

    నాల్గో స్థానంలో ఉప్పెన.. ఐదులో అల

    నాల్గో స్థానంలో ఉప్పెన.. ఐదులో అల


    ఈ జాబితాలో నాలుగో స్థానంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన' మూవీలోని ‘నీ కన్ను నీలి సముద్రం' అనే పాట నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. దాని తర్వాతి స్థానాన్ని అంటే ఫిఫ్త్ ప్లేస్‌ను ‘అల.. వైకుంఠపురములో' చిత్రంలోని ‘సామజవరగమన' అనే పాట దక్కించుకుంది.

    ఆరో స్థానంలో భీష్మ.. ఏడులో పలాస

    ఆరో స్థానంలో భీష్మ.. ఏడులో పలాస

    బెస్ట్ సాంగ్స్ లిస్టులో.. నితిన్ - రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ' చిత్రంలోని ‘వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ' అనే పాట ఆరో స్థానంలో నిలిచింది. దీనికి సాగర్ మహతీ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలాగే, ఏడో స్థానంలో ‘పలాస 1978' చిత్రంలోని ‘నక్కిలీసు గొలుసు అనే పాట ఉంది. ఎంతగానో ట్రెండ్ అయిన ఈ సాంగ్‌కు రఘు కుంచే సంగీతం సమకూర్చాడు.

    ఎనిమిది జాను.. తొమ్మిదిలో సవారి

    ఎనిమిది జాను.. తొమ్మిదిలో సవారి


    ఇక, ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో శర్వానంద్ - సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘జాను' చిత్రంలోని ‘లైఫ్ ఆఫ్ రామ్' అనే పాట నిలిచింది. గోవింద్ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. అలాగే, నందూ - ప్రియాంక కాంబినేషన్‌లో సాహిత్ తెరకెక్కించిన చిత్రం ‘సవారి'. ఇందులోని ‘ఉండిపోవా నువ్విలా' అనే పాట తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీనికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

    పదో స్థానంలో కన్నడ సినిమా పాట

    పదో స్థానంలో కన్నడ సినిమా పాట

    ఈ ఏడాది తెలుగు ఉత్తమ పాటల జాబితాలో అనూహ్యంగా మరో పరిశ్రమకు చెందిన చిత్రం నిలిచింది. అదే ధృవ్ సర్జా - రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన కన్నడ చిత్రం ‘పొగరు'లోని ‘కరాబు మైండ్ కరాబు' అనే పాట. వివాదాస్పదం అవడం వల్ల ఈ పాట దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. ఈ చిత్రానికి చంద్రన్ శెట్టి సంగీతం అందించారు.

    English summary
    The movie songs are commercial advertisement for a feature film which helps in conveying the audiences about the movie before the movie release. Here we have listed the most viewed Telugu movie videos and lyrical songs on Youtube. The list includes Allu Arjun's Butta Bomma and Ramuloo Ramulaa, Pradeep's Neeli Neeli Aakasam and Nithiin's Whattey Beauty song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X