Bhagath Singh Nagar యుగ యుగమైన తరగని వేదన.. రొమాంటిక్ పాటకు మంచి ఆదరణ

యంగ్ టాలెంట్‌ కృషితో తెలుగు సినీ తెరపై మరో విభిన్నమైన మూవీ రాబోతున్నదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతున్నది. విభిన్నమైన కథతో, దేశభక్తి ప్రధానంగా, లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా భగత్ సింగ్ నగర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా విడుదలైన సినిమాకు సంబంధించిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు మరియు తమిళ భాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమాలోని యుగ యుగమైన తరగని వేదన పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

Bhagath Singh Nagars Romantic Song released

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ ... ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాము. ప్రొడ్యూసర్‌గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో కమిట్‌మెంట్ ప్రకారంగా చాలా ఇంట్రెస్ట్‌తో ఈ సినిమా చేశారు. నేను లండన్ ఉన్న కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ నాకు తెలియజేస్తున్న దర్శకుడికి నా ధన్యవాదాలు. ఇంతకుముందు మేము చేసిన పాట లాగే ఈ ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ ... ఇండస్ట్రీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఏంతో ఆవసరం.మా లాంటి కొత్తవారికి అవకాశం కల్పించే నిర్మాత దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే మాకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. త్వరలో ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు: విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
కథ, స్క్రీన్ల్ ప్లే, దర్శకత్వం: వాలాజా క్రాంతి
నిర్మాతలు: వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు
సినిమాటోగ్రఫి: రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్
కొరియోగ్రఫి: ప్రేమ్-గోపి
మ్యూజిక్: ప్రభాకర్ దమ్ముగారి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X