Bhaje Vaayu Vegam Music Review లవర్‌తో లైఫ్ సెట్ అయిందంటున్న కార్తీక్ గుమ్మకొండ

తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా భజే వాయు వేగం. ఐశ్వర్య మీనన్, హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ పాటను రిలీజ్ చేశారు. ఆ పాట ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

Bhaje Vaayu Vegam Music Review Kartikeya Gummakonda Ishwarya Menon looks Tredy in Youthful Song

భజే వాయు వేగం చిత్రంలో సెట్ అయిందే సాంగ్‌ను రధన్ సంగీతం అందించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను రంజిత్ గోవింద్ ఆలపించారు. సంగీత దర్శకుడు రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ రంజిత్ గోవింద్ ఎనర్జిటిక్ గా పాడారు. హోళీ సంబరాల నేపథ్యంతో కలర్ ఫుల్‌గా ఈ పాటను సినిమాటోగ్రాఫర్ ఆర్ డీ రాజశేఖర్ తెరకెక్కించారు

జక జక బ్యాండ్ బాజా పెడుతా
డండరక దరువేసి.. లుంగీ కట్టి డ్యాన్స్ కడతా
పబ్లిసిటీ పక్కా.. ఊరంతా ఊదరకొడతా
పద్దతిగా మన ఇద్దరికి ప్రేమ అయిందని చెబుతా
నీవు లవర్.. నీవు ఫ్లవర్
ఐలవ్ యూ డార్లింగ్
నీ ఫిగర్ నా పొగరు
మస్తు మస్తు మ్యాచింగే
మై డియర్ నా పేరు నా కలర్ ట్యూనింగే
నీ బ్రదర్ నాకు బామర్ది ఫీలింగే

సెట్ అయ్యిందే
లైఫ్ సెట్ అయ్యిందే
నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే,
సెట్ అయ్యిందే
లైఫ్ సెట్ అయ్యిందే,
నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..

అంటూ సాగే పాటను ప్రియురాలిని ఉద్దేశించి ఓ ప్రేమికుడు తన లవ్‌ను వ్యక్తపరిచే సందర్భంలో వస్తుందనే విషయం అర్దమైంది. ఈ పాటను కార్తికేయ, ఐశ్వర్య మీనన్‌పై చిత్రీకరించారు. విశ్వ రఘు కొరియోగ్రఫీ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X