ప్రియుడిని నమ్ముకొంటే మెంటల్ టెన్షన్.. ఆపై సన్యాసమే.. రాజ్ తరుణ్ లవర్ సినీ కష్టాలు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యువ హీరో, హీరోయిన్లు రాజ్ తరుణ్,మనీషా కందుకూర్ జంటగా నటించిన చిత్రం భలే ఉన్నాడే!. రవికాంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు శివసాయి వర్దన్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన ఈ సినిమాలోని నెవర్ ఎండ్ స్టోరీ అనే పాట మాత్రం సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకొంటున్నది. ఆ పాట వివరాల్లోకి వెళితే..

మారుతి టీమ్ ప్రొడక్ట్ బ్యానర్‌పై లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు ఫన్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు మ్యూజిక్ ఆల్బమ్ ప్లస్‌గా మారింది. సంగీత ప్రియుల మనసు దోచుకొన్న ఈ పాటను పాపులర్ సింగ్ మంగ్లీ పాడారు. ఈ పాటకు చైతూ సత్సంగీ సాహిత్యం అందించారు.

Bhale Unnade Music Review Raj Tarun s Never End Story Song Trending on Youtube

ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. రొమాంటిక్ మూమెంట్స్ సాగే ఈ పాటలో రాజ్ తరుణ్, మనీషా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎలాంటి అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా మంచి సాహిత్యంతో సాగుతుంది.

నెవర్ ఎండ్ స్టోరీ లాగా
నీ లవ్వు లేదే ట్రేండీ లాగా
మైండ్ బ్లాక్ అవుతుందే
వదిలేయ్.. వదిలేసేయ్
గాలి మేడలే కట్టొద్దే..
ప్రేమ పక్షిలా ఎగురొద్దే
దాగి వద్ది ఉన్న ఊహల్ని
వదిలేయ్.. వదిలేసేయ్..

వాడిని నమ్మి పోమాకే..
హోపులు పెంచుకోమాకే..
నీలోపు పుట్టిన ఆశలన్నీ
వదలకపోతే.. అవుతుందే.

లైఫే ముందింక.. సో బరువే అయిపోయే
నీకే మిగిలేది.. మెంటల్ టెన్షనే
లైఫే ఏం లేకా ఎంప్టీ అయిపోతేదే
ఇక మిగిలేది సన్యాసమే అంటూ సాగే పాట మంచి జోష్‌తో సాగుతుంది.

ప్రియుడితో జరిగే ప్రేమ వ్యవహారంలో వచ్చే ఈ పాట సినిమాలో మంచి ప్లేస్ మెంట్‌తో సాగుతుంది. ఈ పాటపై చిత్రీకరించిన సన్నివేశాలకు థియేటర్లలో మంచి అప్లాజ్ వస్తున్నది. ఈ పాట వినండి.. మీరు ప్రేమలో పడిపోతారు.. లూప్‌లో తప్పకుండా వింటారు. ..

More from Filmibeat

Read more about: raj tarun bhale unnade manisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X