Chilipi Varaale Ivvu song review వరుణ్ ధావన్‌పై కృతిసనన్ ముద్దుల వర్షం.. రొమాన్స్, కెమిస్ట్రీ అదుర్స్
బాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకొన్న స్త్రీ, రూహి చిత్రాల తర్వాత నిర్మాత దినేష్ విజన్ నిర్మించిన చిత్రం భేదియా. అమర్ కౌశిక్ దర్వకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలో నవంబర్ 25న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని చిలిపి వరాలే ఇవ్వు పాటను రిలీజ్ చేశారు. కృతిసనన్, వరుణ్ ధావన్ రొమాంటిక్‌గా పాడుకొన్న పాట ఎలా ఉందంటే..
సచిన్, జిగర్ మ్యూజిక్ ద్వయం అందిస్తున్న భేదియా ఆల్బమ్‌లోని తొలి పాటను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. తుమ్కేశ్వరీ అనే తెలుగు వెర్షన్ పాటకు సంగీత ప్రియులు భారీగా స్పందించారు.

ఇక రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో చిలిపి వరాలు ఇవ్వు అనే పాటను తాజాగా సినీ అభిమానులకు అందించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య, యనమంద్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. యువ గాయకుడు కార్తీక్ ఆలపించారు.
చిలిపి వరాలే ఇవ్వు పాటలో వరుణ్ ధావన్, కృతి సనన్.. రొమాంటిక్ మూమెంట్స్‌తో అద్బుతమైన కెమిస్ట్రీని పండించారు. అందమైన లొకేషన్లలో చీత్రీకరించిన ఆ పాటలో వరుణ్‌పై కృతి ముద్దులు వర్షం కురిపించారు. కౌగిలింతలతో సున్నితమైన రొమాన్స్‌ను పండించారు. దీంతో హారర్ నేపథ్యంగా సాగే లవ్ స్టోరి భేదియాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











