Adavi Thalli Maata: ఎమోషనల్‌గా భీమ్లా నాయక్ పాట.. పవన్ అలా రానా ఇలా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రీమేక్‌ మూవీలు, మల్టీస్టారర్ స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే మన ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు హీరోలు కూడా ధైర్యంగా ముందడుగులు వేస్తున్నారు. ఇలా కొన్ని రోజులుగా ఆ తరహా చిత్రాలు ఎన్నో పట్టాలెక్కేశాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు కూడా చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కానుంది.

 Bheemla Nayak Adavi Thalli Maata Song Released

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా బ్లాక్‌బస్టర్ అవుతోంది. ఇలా ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలకు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. వీటి వల్ల ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయనే చెప్పాలి. దీంతో దీనికి బిజినెస్ కూడా భారీ మొత్తాల్లో జరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి 'అడవి తల్లి మాట' అనే ఎమోషనల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు ఉదయం 'భీమ్లా నాయక్' మూవీ నుంచి నాలుగో పాటగా 'అడవి తల్లి మాట' అంటూ సాగే ఓ ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. దీన్ని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటను సాహితి చాగంటి, కుమ్మరి దుర్గవ్వలు అద్భుతంగా ఆలపించారు. ఇక, ఈ పాటలో ఇద్దరు హీరోలతో పాటు వాళ్లకు జోడీగా నటించిన హీరోయిన్లను కూడా చూపించారు. ఇద్దరి మధ్య జరిగే గొడవలు ఎలాంటి కష్టనష్టాలను తీసుకొచ్చాయన్న పాయింట్‌తో ఈ పాట రూపొందినట్లు వింటే అర్థం అవుతోంది. మొత్తానికి ఈ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి.

'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X