Antha Istam Song: భీమ్లా నాయక్ నుంచి మరో కానుక.. పవన్ రేంజ్‌కు సరిపోయేలా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ చూడనంత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీని అందుకున్న అతడు.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా మొదలు పెట్టి.. ఇప్పుడు ఆయా చిత్రాల షూటింగ్‌లలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కుతోంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో కొద్ది రోజుల క్రితం నుంచే అప్‌డేట్లను ఇస్తున్నారు.

Bheemla Nayak Antha Istam Song Promo Released

క్రేజీ కాంబినేషన్‌లో బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ చివరి వారానికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ ప్రోమో విడుదలైంది.

'భీమ్లా నాయక్' మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పాట చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వ్యూస్, లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'అంత ఇష్టం' అనే పాట రాబోతుంది. అక్టోబర్ 15, ఉదయం 10:19 గంటలకు ఈ పాట విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. దీన్ని థమన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక, ఈ పాటను కేఎస్ చిత్ర ఆలపించారు.

పవన్ కల్యాన్ - దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్‌తో పాటు సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X