Bheemla Nayak నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్: అదిరిపోయే ప్లాన్ చేసిన పవన్ కల్యాణ్ టీమ్

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. దీంతో ఈ తరహా చిత్రాలు చేయడానికి హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. దీంతో మల్టీస్టారర్ మూవీలు వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగులో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా ఇందులో కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ భారీ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.

వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఒక ప్రాంతంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

క్రేజీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా బ్లాక్‌బస్టర్ అవుతోంది. ఇలా ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలకు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. వీటి వల్ల ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయనే చెప్పాలి. దీంతో దీనికి బిజినెస్ కూడా భారీ మొత్తాల్లో జరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి నూతన సంవత్సర కానుకగా మరో అదిరిపోయే ట్రీట్ రాబోతుందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Bheemla Nayak LaLa Bheemla DJ Version Song on December 31st

'భీమ్లా నాయక్' మూవీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు పాటలు విడుదలయ్యాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా 'లాలా భీమ్లా' అంటూ సాగే పాట డీజే వెర్షన్‌ను విడుదల చేయబోతున్నారు. దీన్ని డిసెంబర్ 31, సాయంత్రం 7:02 గంటలకు వదులుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు దగ్గుబాటి రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

భారీ రేంజ్‌లో రాబోతున్న 'భీమ్లా నాయక్' సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X