మందు బాటిల్‌తో పవన్‌ కల్యాణ్: భీమ్లా నాయక్ నుంచి మరో వీడియో.. సర్‌ప్రైజ్ అదిరిందిగా!

సుదీర్ఘమైన విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి గతంలో ఎన్నడూ చూడనంత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీని అందుకున్న అతడు.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా మొదలు పెట్టి.. ఇప్పుడు ఆయా చిత్రాల షూటింగ్‌లలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. అదేంటో మీరూ చూడండి!

‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఆ మూవీ రీమేక్.. ఇద్దరు హీరోల పాత్రలు

ఆ మూవీ రీమేక్.. ఇద్దరు హీరోల పాత్రలు

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' భీమ్లా నాయక్ మూవీ రీమేక్‌గా వస్తోంది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది తెరకెక్కుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.

‘భీమ్లా నాయక్' అన్నీ అదుర్స్ అనేలా

‘భీమ్లా నాయక్' అన్నీ అదుర్స్ అనేలా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియో పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

భీమ్లా నాయక్ నుంచి మరో వీడియో రెడీ

భీమ్లా నాయక్ నుంచి మరో వీడియో రెడీ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీ నుంచి 'ద సౌండ్ ఆఫ్ భీమ్లా' పేరిట ఓ వీడియో రాబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. 'లాలా భీంలా' అంటూ సాగే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో వీడియోను ఈరోజు సాయంత్రం 7:02 గంటలకు రిలీజ్ చేస్తారట.

అదిరిపోయే గెటప్‌తో వచ్చిన పవర్ స్టార్

అదిరిపోయే గెటప్‌తో వచ్చిన పవర్ స్టార్

టైటిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో వీడియోకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చే క్రమంలో 'భీమ్లా నాయక్' యూనిట్ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ మాస్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. నుదిటిన బొట్టు.. గళ్ల లుంగీ కట్టుకుని రచ్చ చేస్తున్నాడు. ఇక, అతడి ముందే మందు బాటిల్ కూడా ఉంది. ఈ లుక్ పోస్టర్‌ ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతోంది.

 రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారుగా

రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారుగా

'భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, పలు కారణాల వల్ల ఇది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఈ సినిమాను జనవరి 12నే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X