లైవ్ స్టేజ్ షోలో ఊహించని ప్రమాదం.. సింగర్ కు బుల్లెట్ గాయాలు
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న శర్వానంద్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ సింగర్ కు తృటిలో ప్రాణపాయం తప్పింది. ఆమె ఎవరో కాదు భోజ్ పురి ఫోక్ సింగర్ నిషా ఉపాధ్యాయ. ఆమెకు తృటిలో ప్రాణ పాయం తప్పింది. బీహార్ లోని పాట్నాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో లైవ్ ఫెర్మామెన్స్ ఇస్తున్న సమయంలో అక్కడ కాల్పులు జరిగాయి. ఆ టైమ్ లో ఆమెకు బుల్లెట్ గాయాలయ్యినట్లు తెలుస్తోంది. నిషా ఎడమ తొడకు బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె పాట్నాలోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమకు సమాచారం అందిందని వెల్లడించారు. కానీ ఎలాంటి కంప్లైంట్ మాత్రం రాలేదని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎలా తుపాకీ కాల్పులు జరిగాయనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు ఎవరు కాల్చారు... ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారో దర్యాప్తు చేస్తున్నారు.

నిషా ఉపాధ్యాయ బీహార్‌కు చెందిన ప్రముఖ గాయని. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా వంటి పాటలు ఆమె పాడింది. ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఆమె తరచుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెపై కాల్పులు జరిగాయి.
ఇదిలా ఉంటే సినిమా ప్రముఖులపై దాడులు కొత్తేమి కాదు. గతంలో కూడా ప్రముఖలపై చాలా సార్లు అగంతకులు దాడులు జరిపారు. ఇటీవల ఆకాశమే హద్దురా హీరోయిన్ అపర్ణా బాల మురళీకి అటువంటి చేదు అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. ఓ కాలేజీలో ఆమెతో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ఆమె మీద చేతులు వేసేందుకు ప్రయత్నించగా ఆమె ఇబ్బంది పడ్డారు. మరో ఘటన కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న ఓ నటిని ఫాలో అవుతూ ఓ వ్యక్తి వేధించాడు. దీనిపై కూడా అప్పట్లో చర్చనీంశమైంది.


Click it and Unblock the Notifications