Bhola Mania: భోళా శంకర్ మెగా అప్డేట్.. ఫ్యాన్స్ స్టెప్పులేసే టైమ్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కోసం మెగా ఫాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ మాస్ దర్శకుడు మెహర్ రమేష్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. కేవలం కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు స్విజర్లాండ్ కు వెళ్లి ఒక పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
అక్కడ మెగాస్టార్ చిరంజీవి తమన్నా భాటియా కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాటను షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అప్డేట్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. భోళా శంకర్ కు సంబంధించిన ప్రతీ అప్డేట్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు అసలైన సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ సిద్దమయింది.

ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమాకు భోళా మేనియా అంటూ ఒక పోస్టర్ కూడా వదిలారు. అందులో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ గెటప్ తో స్టిల్ ఇవ్వడం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక అసలైన మొదటి సాంగ్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ హీరోయిన్ గా మెప్పించనుంది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. భోళా శంకర్ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











