Chiranjeevi: రంగంలోకి దిగుతున్న భోళా శంకర్.. ఇక విజిల్స్ వేయాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా ఈ మూవీలో కనిపించబోతోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ నుంచి రాబోతోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీ సాంగ్స్ కి షూటింగ్ ప్రస్తుతం స్విడ్జర్లాండ్ లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం చిరంజీవి ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన పాటల సందడి మొదలైంది. ఆగష్టు 11న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందుగానే సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

అందులో భాగంగా భోళా శంకర్ నుంచి ఫస్ట్ సింగిల్ భోళా మానియా లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 2న ఈ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేయనున్నారు. తరువాత జూన్ 4న లెరికల్ వీడియోని రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఇక భోళా మానియా మూవీ టైటిల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ డాన్స్ మూమెంట్ ని పోస్టర్ లో రిప్రజెంట్ చేశారు.
పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి కళ్ళజోడు పెట్టుకొని త్రిశూలం కీ చిన్ ఫింగర్ కి పెట్టి తిప్పుతూ స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ లుక్ మెగా అభిమానులకి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరో వైపు భోళా శంకర్ లో టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది చూడటానికి అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో భోళా శంకర్ పై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి 11 ఏళ్ళ తర్వాత మెహర్ రమేష్ మరల మెగా ఫోన్ పట్టుకొని మెగాస్టార్ నే ఏకంగా డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ మూవీతో ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడు అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











