Bhola Shankar నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈ సారి సెలెబ్రేషన్ జామ్ జామ్ జజ్జనకే!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తున్నారు. కానీ, కొందరు మాత్రం తెలుగులోనే వీలైనన్ని ఎక్కువ చిత్రాలను చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో వేగంగా సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పటికే చాలా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' అనే పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' మూవీని దర్శకత్వానికి చాలా కాలం పాటు దూరంగా ఉంటోన్న మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్‌గా మొదటి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఈ సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతునట్లు తాజాగా ప్రకటించారు.

Bhola Shankar Movie Jam Jam Jajjanaka Song Release On July 11th

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో పాటు ఓ పాటను విడుదల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి 'జామ్ జామ్ జజ్జనక' అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ ప్రోమోను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే, పూర్తి పాటను జూలై 11వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక, తాజాగా వదిలిన పోస్టర్‌లో చిరంజీవి లుక్ అదిరిందనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X