Rage Of Bholaa: ర్యాంప్ ఆడించిన భోళా ర్యాప్.. అబ్బా ఏముంది భయ్యా!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్‌ హీరోల్లో వేగంగా సినిమాలు చేసే వాళ్లు చాలా అంటే చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం బ్రేక్ తీసుకోని ఆయన.. ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

దీనికితోడు మంచి ఫలితాలను రాబడుతూ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇలా ఇప్పుడు ఆయన నటించిన చిత్రమే 'భోళా శంకర్'. సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

Bhola Shankar Movie Rage Of Bholaa Anthem Released

టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేష్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రమే 'భోళా శంకర్'. తమిళంలో రూపొంది సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న 'వేదాళం'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

దీంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ రిలీజ్‌కు దగ్గర పడడంతో అవడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి 'Rage Of Bholaa' అనే ఏంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీన్ని మెహర్ రమేష్, ఫిరోజ్ ఇజ్రాయిల్ రచించగా.. అసుర, ఫిరోజ్ ఆలపించారు. ఇక, ఈ సాంగ్ టీజర్‌లోని విజువల్స్‌తో డిజైన్ చేశారు. ఇందులోని లిరిక్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నారు. దీంతో ఈ పాటకు శ్రోతల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

ఇక.. 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటిస్తుండగా.. కీర్తి సురేష్, సుశాంత్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X