శివ బాలాజీ చేతుల మీదుగా నేనెవరు పాట రిలీజ్.. భావోద్వేగం, ఫీల్‌గుడ్‌గా..
ట్రెండీ కంటెంట్‌తో ప్రేక్షకుల మెప్పిస్తున్న చిన్న చిత్రాల హవా టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నది. మంచి కంటెంట్, ఫీల్‌గుడ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న చిత్రం నేనెవరు. కౌశల్ క్రియేషన్ పతాకంపై నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన నన్ను వదలి నీవు పోలేవులే' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్. కాగా...

నేనెవరు చిత్రం నుంచి 'నిలువవే' అనే పాటను వెర్సటైల్ ఆర్టిస్ట్, బిగ్‌బాస్ ఫేమ్ శివబాలాజీ రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి. ఆర్.జి.సారధి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చారు.

ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ... పాటలో భావోద్వేగంతోపాటు మంచి ఫీల్ ఉంది. ఓ మంచి పాటను నేను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న సారథికి, హీరోగా బాలకృష్ణకి చాలా మంచి పేరు రావాలి అని విషెస్ తెలియజేశారు.
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న నేనెవరు సినిమా పాటను రిలీజ్చేసిన శివ బాలాజీకి హీరో బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్ జీ సారథి ధన్యవాదాలు తెలియజేశారు.

నటీనటులు: రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ తదితరులు
కెమెరా: సామల భాస్కర్
ఫైట్స్: రియల్ సతీష్
పిఆర్వో: ధీరజ్ అప్పాజీ
పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్,
పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్
ఎడిటింగ్: కోలా భాస్కర్
సంగీతం: ఆర్ జి సారథి
సహ నిర్మాతలు: పూనమ్ చంద్ కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి
నిర్మాతలు: భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు
దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటిశివప్రసాద్- తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!


Click it and Unblock the Notifications











