Bigg Boss Telugu 5 టీమ్ చేతుల మీదుగా ఐరావతం లిరిక్ సాంగ్. రామ్ మిర్యాల పాట ట్రెండింగ్

మంచి కంటెంట్‌తో, ప్రేక్షకులను మెప్పించే విధంగా సంగీతంతో యువ గాయనీ, గాయకులు ఆలపించిన పాటలు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఇలాంటి పాటలు ఉన్న చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా భారీ క్రేజ్‌ను సంపాదించుకొంటున్నాయి. ఇలాంటి కోవలోనే సింగింగ్ సెన్సేషన్ రామ్ మిర్యాల పాడిన ఐరావతం చిత్రంలోని పాటను యూట్యూబ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకొంటున్నది.

నూజివీడు టాకీస్ నుంచి రేఖ పలగాని సమర్పణలో వస్తున్న చిత్రం ఐరావతం. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారిన 'ఓ నా దేవేరి' లిరికల్ వీడియోను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ చేశారు. సింగర్ రామ్ మిర్యాల పాడిన పాట రిలీజైన 24 గంటల్లోనే భారీగా వ్యూస్ సాధించింది. ఇంతకు ముంరు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు విశేష స్పందన రావడం తెలిసిందే.

Bigg Boss Telugu 5 team unveils Iravatam Song: Na Deveri Song gets good response

ఐరావతం లిరిక్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్‌బాస్ తెలుగు 5 టీమ్ ప్రత్యేక ఆకర్షితులుగా మారారు. ఈ ఈవెంట్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, ఆర్జే కాజల్, ప్రణీత్, యాంటీలియా మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ చేతుల మీదురగా 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.

ఐరావతం సినిమా హీరో, హీరోయిన్లు అమర్ దీప్, తన్వీ మాట్లాడుతూ.. విభిన్నమైన కథతో కూడిన సినిమాలో నటించే అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

నిర్మాతలు రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా మాట్లాడుతూ.. కథలోని న్యూ వేవ్ ట్రీట్మెంట్ ఈ మూవీ తీయడానికి ప్రేరణ కలిగించింది. ఇలాంటి కొత్త కథలు చెప్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లను శరవేగంగా పూర్తి చేసుకోనున్నది అని అన్నారు.

దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ.. ఓ నా దేవేరి పాటని చక్కటి మెలోడియస్‌గా కంపోజింగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సత్యకు, ఈ పాటకు ప్రాణాన్ని పోసిన రామ్ మిరియాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐరావతం సినిమాలోని ప్రముఖ పాత్రల్లో 'ఐరావతం' అనే ముఖ్య పాత్ర ఎవరిది? వైట్ కలర్‌ కెమెరా‌ని క్లిక్ చేస్తే జరిగే మ్యాజిక్ ఏంటనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది అని తెలిపారు. ఐరావతం చిత్రంలో హీరోయిన్ చేతుల్లోకి వైట్ కెమెరా వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏమిటి? అత్యంత ఎంగేజింగ్‌గా రాసుకున్న స్క్రీన్ ప్లే అని సినిమా చూస్తే తెలుస్తోంది అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి నా దేవేరి పాటను ఇచ్చినందుకు, అందుకు సహకరించిన నిర్మాత, దర్శకుడికి ధన్యాదాలు, ఇలాంటి యునీక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వడం తన లక్ అని అన్నారు.

నటీనటులు
నటీనటులు: అమర్‌దీప్‌, తన్వి, అరుణ్, ఎస్తేర్, సప్తగిరి, జయవాణి, సంజయ్ నాయర్, రవీంద్ర తదితరులు
సమర్పణ: రేఖ పలగాని
నిర్మాతలు: రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా
దర్శకుడు: సుహాస్ మీరా
సినిమాటోగ్రఫి: ఆర్కే వల్లెపు
సంగీతం: సత్య కశ్యప్
ఎడిటర్: సురేష్ దుర్గం
పీఆర్వో: మధు వీ ఆర్
డిజిటల్: మనోజ్
పోస్టర్లు: ధని ఏలే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X