twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో బిత్తిరి సత్తి... అరచేతిలో స్వర్గం చూపే నేతలను నమ్మొద్దని పొలిటికల్ పంచ్

    |

    ఆంధ్రా, తెలంగాణలో ఎన్నికల ఊపు జోరందుకున్నది. పలు కారణాలతో కళాకారులు, సినీ నటులు తమకు నచ్చిన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. పలువురు సినీ కళాకారులు రాజకీయాల్లోకి వెళ్లడం వివాదంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిని కూడా రాజకీయ పార్టీలు వదల్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి ఓ పార్టీ ప్లాన్ వేసింది. తమ నాయకుడిని కీర్తిస్తూ ఎన్నికల పాటను ఆయన చేత పాడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

     విశేషంగా రాణిస్తున్న బిత్తిరి సత్తి

    విశేషంగా రాణిస్తున్న బిత్తిరి సత్తి

    తెలంగాణ యాస, భాషతో యాంకర్‌గా, ప్రజెంటర్‌గా బిత్తిరి సత్తి రాణిస్తూ విశేషంగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. ప్రాంతాలకు అతీతంగా బిత్తిరి సత్తిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. ఆయన పాల్గొనే టెలివిజన్ షోకు మంచి రెస్పాన్స్ ఉంది.

    హీరోగా వెండితెరపైన

    హీరోగా వెండితెరపైన

    టెలివిజన్ ప్రజెంటర్‌గా మంచి క్రేజ్ ఉండటంతో ఇప్పుడిప్పుడే నటుడిగా, కమెడియన్‌గా, హీరోగా స్థిరపడేందుకు అడుగులు వేస్తున్నాడు. త్వరలో ఆయన నటించిన తుపాకీ రాముడు విడుదల కానున్నది. దిక్సూచి చిత్రంలో ఆయన పాడిన పాట వైరల్‌గా మారింది.

    రాజకీయ పార్టీ కోసం పాట

    ఇలా తనకంటూ క్రేజ్ సంపాదించుకొంటున్న బిత్తిరి సత్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని ప్రధాన పార్టీ కోసం ఓ పాట పాడారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేస్తూ పాటను తన గళంతో అందుకొన్నారు. మంచి ప్రొఫెషనల్ సింగర్‌గా పాటను అద్భుతంగా పాడారు. అయితే ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పాడటం వివాదంగా మారింది.

     విమర్శలు, ప్రశంసలతో వైరల్

    విమర్శలు, ప్రశంసలతో వైరల్

    బిత్తిరి సత్తి పాడిన పాటకు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందన వ్యక్తమవుతున్నది. ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా పాటపాడరనే మాట ఓ వైపు వినిపిస్తుండగా, మరోవైపు డబ్బు కోసం సొంత ప్రయోజనాలు పణంగా పెడుతారా అనే మాట కూడా వినిపించడం గమనార్హం.

    English summary
    Anchor, Actor, Singer Bittiri Satti sings song for Poitical party for coming elections. He supported a Party with his voice. This song goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X