ఐటెం సాంగ్ కి వరుస షాక్స్.. ముందు మేల్ వర్షన్ సాంగ్.. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్!
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సినిమా కోసం జనం చాలా ఎదురు చూశారు. సినిమా ఎలా ఉంటుందో అని కొందరు ఎదురు చూస్తే, . ఆ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూసి ఎంజాయ్ చేయాలా అని వెయిట్ చేసిన వారు ఇంకొందరు. అయితే ఈ సాంగ్ అనేక వివాదాల్లో చిక్కుకోగా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వ్యతిరేకత కూడా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ' అంటూ ఓ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ పాటలో మగాళ్లందరిని తిడుతూ ఉన్న లిరిక్స్ ఉన్నాయి. దీంతో ఈ పాట విడుదల అయిన దగ్గర్నుంచి వివాదాలు చుట్టూ ముట్టాయి. ఈ పాట మీద కేసులు కూడా పెట్టగా తమిళనాడులో కూడా ఈ పాట మీద వ్యతిరేకత కూడా వచ్చింది.

ప్రెస్ మీట్ లో దేవి శ్రీ ప్రసాద్
అయితే సమంత, చంద్రబోస్ కు మహిళా సంఘాల వాళ్ళు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పాట మీ కొన్ని పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిని తొలిగించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ పుష్ప టీం అసలు వీటిని పట్టించుకోలేదు. కనీసం స్పందించ లేదు. అయితే ఎట్టకేలకు నిన్న ప్రెస్ మీట్ లో దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.

దుమారం
తనకు ఐటమ్ సాంగ్స్, భక్తి పాటలు ఒక్కటేనని మ్యూజిక్ డైరెక్టర్ దేవీప్రసాద్ కామెంట్లు చేయడమే కాక పాడి కూడా వినిపించడంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సాంగ్స్ 'రింగ రింగా..', 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' ఈ రెండు పాటలను భక్తి పాటలగా మార్చి పాడారు. అంతటితో ఆగని ఆయన.. ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటలు తన దృష్టిలో ఒక్కటే అని చెప్పడం గమనార్హం.

ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
ఇదే అంశం మీద మ్యూజిక్ డైరెక్ట్ దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 'పుష్ప' సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుని శ్లోకాలతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారని ఆయన అన్నారు. అందుకే దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

మేల్ వెర్షన్ సాంగ్
అన్నట్టు ఈ సాంగ్ కి కౌంటర్ సాంగ్ గా మేల్ వెర్షన్ సాంగ్ కూడా వచ్చింది. "సిక్స్ ప్యాక్ కావాలంటారు.. పొట్ట ఉంది డబ్బులు ఉంటే పర్లేదంటారు.. బైక్ ఉన్నోడు కావాలి.. కార్ ఉన్నోడు వస్తే బైక్ వాడ్ని వదిలేస్తారు, మీకు మనసు కన్నా డబ్బులే ముఖ్యం.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ.." లిరిక్స్ రాసి రాచ్చక్ చేశారు. అంతే కాదు ఊ అంటావా మామ ప్లేస్ లో 'ఊ అంటావా పాపా.. ఊ ఊ అంటావా పాపా..' అంటూ లిరిక్స్ రాశారు.మొత్తం మీద ఈ సాంగ్ రచ్చ కొనసాగుతోంది


Click it and Unblock the Notifications











