Devara: బాలీవుడ్ బ్యూటీ నోట దేవర పాట.. అవాక్కైన జూనియర్ ఎన్టీఆర్!

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఈ మూవీకి సన్సెషల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.ఈ మూవీ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదలకు కేవలం మూడు రోజులే ఉండటంతో హీరో ఎన్టీఆర్‌ తో పాటు మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ బ్యూటీ నోట దేవర సాంగ్ విని జూనియర్ ఎన్టీఆర్ అవాక్కయ్యారు. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఎప్పుడు ఆ అమ్మడు పాట పాడిందో? ఓ సారి లూక్కేయండీ.

ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న దేవర మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే.. ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దేవర మూవీ నుంచి విడుదలైన సాంగ్స్,గ్లింప్స్ ,ట్రైలర్స్ భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ లేని విధంగా వ్యూస్ లో కూడా ట్రైలర్స్ పలు రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో తారక్‌ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్.

Bollywood actress Alia Bhatt sang the Chuttamalle song from Devara movie Jr NTR and Karan Johar impressed

ఈ మూవీని ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక్కడ బడ్జెట్ పరంగా చూస్తూ.. తారక్ సినిమాల్లో వన్ ఆఫ్ ది భారీ బడ్జెట్ మూవీగా చెప్పవచ్చు. ఈ సినిమాకు నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి దాదాపు 160 కోట్ల రూపాయలు వెచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రమోషనల్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా దేవర మేకర్స్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇలా అన్ని ఖర్చులు కలిసి ఈ మూవీకి సూమారు 165 కోట్లు ఖర్చు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ మోస్ట్ ఇగర్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తుండగా.. బాలీవుడ్ విషయానికి వస్తే.. కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దేవర అడ్వాన్స్ సేల్స్ అదరగొడుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా నెల రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదల కేవలం మూడు రోజులో ఉండటంతో మూవీ మేకర్స్ బిజీబిజీ అయ్యారు.

Bollywood actress Alia Bhatt sang the Chuttamalle song from Devara movie Jr NTR and Karan Johar impressed

దేవర పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. దేవర హిందీ వెర్షన్‌ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్‌ పాల్గొంటున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ ఓ స్పెషల్ ఇంటర్య్వూ నిర్వహించారు.ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ కూడా పాల్గొంది. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌కి జోడీగా అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరపై ఈ బాలీవుడ్ బ్యూటీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుందట.

ఈ స్పెషల్ ఇంటర్య్వూలో అలియా మాట్లాడుతూ.. దేవర సినిమా కోసం తాను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కెమిస్ట్రీ చాలా వర్కట్ అయిందన్నారు. ఈ సమయంలో దేవర సినిమాలోని 'చుట్టమల్లే చుట్టేస్తాందే.. తుంటరి చూపు..' అనే పాటను పాడి సర్పైజ్ చేసింది. ఆ సాంగ్ ను లయబద్దంగా.. మంచి టోన్ తో పాడడంతో ఆమె పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ ఆశ్చర్యపోయారు. కరణ్‌ జోహర్‌ కూడా అలియా తెలుగు పాట పాడటంతో అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవర మూవీపై కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు.. సినీ సెలబ్రేటీలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుండటంతో ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: devara jr ntr alia bhatt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X