‘రాయే నువ్ రాయే’.. రష్మీతో ఘాటు రొమాన్స్ చేస్తోన్న నందు!!

సవారి సినిమాతో హీరోగా నిలబడేందుకు నందు ఎంతగానో ప్రయత్నించాడు. అయితే సవారి సినిమాను అంచనాలను అందుకోలేకపోయింది. కానీ మ్యూజికల్ హిట్‌గా నిలిచి అందర్నీ ఆకట్టుకుంది. ఇలా సవారి ఓ మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో మాస్ ఎంటర్టైనర్‌ను సహజత్వం ఉట్టిపడేలా ఓ చిత్రంతో రాబోతోన్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తన సినిమాను బీబీ పేరిట బాగానే ఫేమస్ చేసుకున్నాడు.

బీబీ అంటూ నందు ప్రకటించడం.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడేమో అని అందరూ అనుకోవడం చివరకు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తన తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించాడు. అలా టైటిల్ బయటకు రాకముందే నందు సినిమా వార్తల్లోకి ఎక్కింది. ఆపై రష్మీ ఫస్ట్ లుక్, నందు లుక్ తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్యే వచ్చిన టీజర్ కూడా ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. టీజర్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్‌గా ఉండటంతో పాజిటివ్ టాక్ వచ్చింది.

 Bomma Blockbuster First Single Raaye Nuv Raaye On 19th October

ఇక తాజాగా మరో అప్డేట్‌ను ఇచ్చింది బొమ్మ బ్లాక్ బస్టర్ టీం. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయబోతోన్నట్టు తెలిపింది. అక్టోబర్ 19న ఉదయం పది గంటలకు రాయే నువ్ రాయే అనే పాట విడుదల కాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. రష్మీకి నందు ఘాటుగా ముద్దు పెట్టడం, ఆమె ఏమో మందులో వాటర్ పోస్తూ బిజీగా ఉంది. మొత్తానికి రిలీజ్‌కు ముందే ఈ టీం రచ్చ రచ్చ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X