Book My Show Crash: ‘అడ్వాన్స్’ కోసం ఎగబడిన ఫ్యాన్స్ .. బుక్ మై షో వెబ్‌సైట్ క్రాష్.. దేవర మూవీ కోసం కాదు..
సాధారణంగా సూపర్ స్టార్స్, లెజెండ్, స్టార్ హీరోలు, లేదా ఐకానిక్ సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్స్ క్రాష్ అవుతాయి. అయితే తాజాగా ఇండియాలో పాపులర్ ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్‌మై షో (Book My Show) అత్యధిక మంది టికెట్ల కోసం పోటెత్తడంతో క్రాష్ అయింది. అయితే మీరు ఊహించినట్టు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కోసం అనుకొంటే పప్పులో కాలేసినట్టే.. అభిమానులు ఎగబడి టికెట్లు కొనడానికి ప్రయత్నించింది కేవలం ఓ రాక్ బ్యాండ్ షో. ఆ షోకు ఎందుకంత క్రేజ్.. ఆ రాక్ బ్యాండ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
వరల్డ్‌వైడ్‌గా సంగీత ప్రియులు అత్యంత ఆదరణ చూపించే రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే (Coldplay). ఈ బ్యాండ్ తన ప్రపంచయాత్రను కొనసాగిస్తున్నది. మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ అనే పేరుతో వరల్డ్ టూర్ కొనసాగిస్తూ ఇండియాలో ప్రదర్శనను ఇవ్వనున్నది. ఈ షో ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో 2025 సంవత్సరంలో జనవరి 18, 19వ తేదీల్లో జరుగున్నది.

గతంలో ఈ రాక్ బ్యాండ్ 2016లో ముంబైలో జరిగిన గ్లోబల్ సిటిజెన్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చింది. కోల్డ్‌ప్లే టీమ్ 8 సంవత్సరాల తర్వాత ఇండియాకు వస్తుండటంతో అభిమానులకు క్రేజీగా మారింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యూజిక్ లవర్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం కాచుకొని కూర్చున్నారు. ఆదివారం సెప్టెంబర్ 22వ తేదీన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో బుక్ మై షో మీద విరగబడ్డారు.
కోల్డ్ ప్లే షోకు విశేషమైన ఆదరణ ఉండటంతో ఒక్కసారిగా పరిమితికి మించి యూజర్లు లాగిన్ అవ్వడంతో బుక్ మై షో సైట్ క్రాష్ అయింది. దాంతో అభిమానులు టికెట్లు సొంతం చేసుకొనేందుకు ఇక్కట్లు పడ్డారు. అయితే వెంటనే సైట్‌ను పునరుద్దించేందుకు టీమ్ చర్యలు చేపట్టింది. ఇలాంటి రెస్పాన్స్ ఇటీవల కాలంలో కనిపించకపోవడంతో ఈ షోపై మరింత క్రేజ్ పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు 2022 సంవత్సరంలో వరల్డ్ టూర్‌ను 2022లో ప్రకటించింది. అబుదాబీ, సియోల్, హాంకాంగ్‌లో జరిగే షోల కోసం సుమారుగా 10 మిలియన్లు అంటే కోటికిపైగా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ముంబై షో కోసం భారీగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఇదిలా ఉండగా, కోల్డ్‌ప్లే రాక్ బ్యాండ్‌ను 1997 సంవత్సరంలో ప్రారంభించారు. క్రిస్ మార్టిన్, జానీ బుక్‌లాండ్, గయ్ బెర్నీమెన్, విల్ చాంఫియన్ లాంటి మ్యూజిక్ లెజెండ్స్ ఈ బ్యాండ్‌లో ఉన్నారు. వారు రూపొందించిన ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, డోంట్ పానిక్, వైవా లా విడా, ఇన్ మై ప్లేస్ లాంటి ఆల్బమ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం మూన్ మ్యూజిక్ ఆల్బమ్‌లో సంగీత అభిమానుల ముందుకు వస్తున్నారు.


Click it and Unblock the Notifications











