యువ మ్యూజిక్ సంచలనం ఆకస్మిక మరణం.. అలా వెంటాడిన మృత్యువు

మ్యూజిక్ ప్రపంచంలో యువ కెరటం లియామ్ పేన్ ఆకస్మిక మరణం సంగీత ప్రియులను విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణ వార్తతో అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అకాల మృత్యువు ఆయనను కబళించిన దుర్ఘటనను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సంగీత ప్రపంచంలో ఉవ్వెత్తున దూసుకొచ్చిన లియామ్ పేనే విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆయన నిర్వహించే బాయ్ బ్యాండ్ వన్ డైరెక్షన్ ద్వారా భారీ పాపులారిటీని సంపాదించుకొన్నారు. ఆయన ఇకలేరనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. కోట్లాది మంది సంగీత అభిమానులు ప్రపంచవ్యాప్తంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

Boy Band One Direction fame Liam Payne dead fall from 3rd floor of Hotel Room in Buenos Aires

లియామ్ పేన్ విషయానికి వస్తే.. ఆయన వయసు 31 సంవత్సరాలు. ఇంగ్లాడ్‌లోని వాల్వర్ హ్యాంప్టన్ నగరంలో 1993 సంవత్సరంలో జన్మించారు. సింగర్, సాంగ్ రైటర్‌గా అనతికాలంలోనే పాపులారిటీని సాధించారు. చెరిల్ కోల్, మాయా హెన్నీ లాంటి మ్యూజిక్ స్టార్స్‌తో భాగస్వామ్యం పంచుకొని విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు.

ఐక్లారీ, వన్ డైరెక్షన్: దిస్ ఈజ్ హజ్, వేర్ వీ ఆర్: ది కాన్సర్ట్ ఫిల్మ్, డైనమో: మెజిషియన్ ఇంపాజిబుల్, డ్యాన్సింగ్ విత్ ది స్టార్, ఫ్యామిలీ గయ్, డ్రాప్ ది మిక్, రాన్స్ గాన్ రాంగ్ లాంటి చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటుడిగా రాణించారు.

Boy Band One Direction fame Liam Payne dead fall from 3rd floor of Hotel Room in Buenos Aires

స్ట్రిప్ దట్ డౌన్, గెట్ లో, బెడ్ రూమ్ ఫ్లోర్, ఫర్ యూ, ఫెమిలియర్, ఫస్ట్ టైమ్, పోలరాయిడ్, స్టాక్ ఇట్ అప్, ఆల్ ఐ వాంట్, లివ్ ఫరెవర్ లాంటి సింగిల్ ఆల్బమ్స్ ప్రపంచవ వ్యాప్తంగా పలు దేశాల్లో చార్ట్ బస్టర్'గా నిలిచాయి. ఇలాంటి గొప్ప సంగీతకారుడు ఆకాల మృతి చెందడం విషాదంలో ముంచెత్తింది.

లియామ్ పేన్ మరణం గురించి బ్యూనస్ ఎయిర్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. కాసా సర్ హోటెల్ ఉంటున్న ఆయన మూడో ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఎక్కువగా రక్తస్రావం జరిగింది. ఆయన అక్కడిక్కడే మరణించాడు.

లియామ్ పేన్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పై అంతస్తు నుంచి ఎవరో తోసివేసి ఉంటారు. డ్రగ్స్, ఆల్కాహాల్ మత్తులో బలంగా ఉన్న వ్యక్తి ఎవరో తోసి ఉంటారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X