For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో పెళ్లికి సిద్ధమైన పాపులర్ సింగర్.. అలా వేలెత్తి చూపుతూ ప్రియుడితో లిప్‌లాక్.. ట్విస్ట్ ఏమిటంటే?

  |

  ప్రఖ్యాత పాప్ స్టార్, సింగర్, సినీ రచయిత, డ్యాన్సర్ బ్రిట్నీ స్పియర్ మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకొని భర్తకు గుడ్‌బై చెప్పిన ఈ పాప్ సింగర్ మరోసారి దాంపత్య జీవితానికి సంబంధించిన అదృష్టరేఖను పరీక్షించుకోబోతున్నారు. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న ప్రియుడితో పెళ్లి నిశ్చితార్థం చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. బ్రిట్ని స్పియర్ ఎంగేజ్‌మెంట్, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  23 ఏళ్ల వయసులోనే తొలి వివాహం

  23 ఏళ్ల వయసులోనే తొలి వివాహం

  చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రిట్నీ స్పియర్ వ్యక్తిగత అనేక ఒడిదుడుకులతో సాగింది. 23 ఏళ్ల వయసులోనే మొదటి వివాహం చేసుకొన్నది. 2004లో జాసన్ అలెన్ అలెగ్జాండర్‌తో జరిగిన వివాహం ఎంతోసేపు నిలువలేదు. కేవలం 55 గంటల వ్యవధిలోనే బ్రిట్నీ స్పియర్ తన భర్త జాసన్‌కు గుడ్‌బై చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది.

  ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

  55 గంటల్లోనే విడాకులు.. ర్యాపర్‌తో పెళ్లి

  55 గంటల్లోనే విడాకులు.. ర్యాపర్‌తో పెళ్లి

  మొదటి భర్తకు విడాకులు చెప్పిన కొద్ది నెలలకే మళ్లీ 2004లో రెండో వివాహం చేసుకొన్నది. కెవిన్ ఫెడర్‌లైన్ అనే ర్యాపర్; టెలివిజన్ నటుడిని పెళ్లి చేసుకొన్నది. అయితే వారి సంసారం సవ్యంగా సాగుతుందని అనుకొనేంతలోపే అనూహ్యంగా వారి దాంపత్య జీవితం బ్రేకప్ అయింది. 2007 సంవత్సరంలో కెవిన్, బ్రిట్నీ స్పియర్ విడాకులు తీసుకొన్నారు.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  ఫిట్‌నెస్ ట్రైనర్‌ సామ్‌తో డేటింగ్

  ఫిట్‌నెస్ ట్రైనర్‌ సామ్‌తో డేటింగ్

  ఆ తర్వాత ఫిట్‌నెస్ ట్రైనర్ సామ్ అస్గారీతో బ్రిట్నీ స్పియర్ ప్రేమలో పడింది. 2016లో స్లంబర్ పార్టీ మ్యూజిక్ వీడియో షూటింగ్ సందర్భంగా వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అంటే అంటే దాదాపు ఐదేళ్లకుపైగా వారు డేటింగ్, సహజీవనం చేస్తున్నారు. అయితే తన అఫైర్‌పై అనేక వార్తలు వచ్చినా గానీ బ్రిట్నీ స్పియర్ ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. అయితే అనూహ్యంగా కొద్ది రోజుల క్రితం నిశ్చితార్తం జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు షాక్ గురయ్యారు.

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

  బ్రిట్ని స్పియర్ వీడియోను షేర్ చేసి

  బ్రిట్ని స్పియర్ వీడియోను షేర్ చేసి

  నిశ్చితార్థం వార్తల నేపథ్యంలో బ్రిట్ని స్పియర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ప్రియుడు సామ్ బుగ్గలపై ముద్దు పెడుతూ.. నాకు నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నాను అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. పింక్ కలర్ డ్రస్‌లో బ్రిట్నీ స్పియర్ కనిపించింది. వారిద్దరూ అతి సన్నిహితంగా ఫోటోలో కనిపించారు. అయితే నిశ్చితార్థం గురించి ఏమీ చెప్పకపోవడం గమనార్హం.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  ప్రియుడు సామ్ ఫోటోను షేర్ చేస్తే..

  ప్రియుడు సామ్ ఫోటోను షేర్ చేస్తే..

  బ్రిటీ స్పియర్ ప్రియుడు సామ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోను షేర్ చేశారు. సామ్‌కు లిప్‌లాక్ ఇస్తూ.. తన చేతి వేలికి తొడిగిన వజ్రపు ఉంగరాన్ని చూపించింది. తన వేలిని చూపిస్తూ నాకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది అయితే రెండు రోజుల తర్వాత ఊహించని విధంగా ఆ ఫోటోను డిలీట్ చేసి అభిమానులకు షాకిచ్చారు. అయితే తన అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైందని చెప్పడం ఈ నిశ్చితార్థం విషయంలో ట్విస్ట్‌గా మారింది.

  Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
  ఎంగేజ్‌మెంట్ న్యూస్ ఖండించిన ప్రియుడు

  ఎంగేజ్‌మెంట్ న్యూస్ ఖండించిన ప్రియుడు

  బ్రిట్ని స్పియర్ పెళ్లి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తను ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్, ప్రియుడు ఖండించారు. నా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. బ్రిటీతో నా ఫోటో ఫోటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేశారు. ఆ వార్తను నమ్మకూడదు అంటూ సామ్ ఓ ప్రకటన చేశాడు. అయితే ఈ వ్యవహారంపై బ్రిట్ని స్పియర్ స్పందించకపోవడం అనేక సందేహాలకు తావిస్తున్నది.

  English summary
  Britney Spears engagement news shakes music world. Britney with Sam Asgari photo goes viral in social media. But Sam Asghari announced that his instagram accound hacked. Their photo was photoshoped.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X