3 సార్లు పెళ్లి పెటాకులు.. షాకింగ్‌గా లేడీ సింగర్ నాలుగో పెళ్లి.. పవన్ కల్యాణ్‌ పాటల్లో ఆమెదే జపం!

తెలుగు సినిమా పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫిల్మోగ్రఫీ తన సినిమాల్లో పాటలలో తన టేస్ట్ ఏంటి అనేది తన ఫ్యాన్స్ కి మ్యూజిక్ లవర్స్ కి కూడా బాగా తెలుసు. అయితే తెలుగులో పవన్ నటించిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్స్ లో ఒకటి "జల్సా" అని చెప్పాలి.

కాగా అప్పట్లోనే ఈ సినిమా ఆడియో క్యాసెట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి అమ్ముడుపోయాయని టాక్ ఉంది. ఆ రేంజ్ లో పవన్ రేంజ్ ఉండేది. అయితే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కూడా పెద్ద హిట్టే.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో పీక్ ఆల్బమ్ కూడా అప్పట్లో ఇదే. మరి ఈ ఆల్బమ్ లో జెన్నిఫర్ లోపేజ్ సాంగ్ అందరికీ తప్పకుండా గుర్తుండి ఉంటుంది.

Britney Spears married for 4th time her self with a twist

అయితే ఈ సాంగ్ లో బ్రెట్నీ స్పియర్స్ అంటూ మాంచి బీట్ లిరిక్స్ సాగుతాయి. కాగా మ్యూజిక్ లవర్స్ అయితే ఈ బ్రెట్నీ స్పియర్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాలీవుడ్ మ్యూజిక్ లో ఎన్నో ఏళ్ళు తన సాంగ్స్, అద్భుతమైన గొంతుతో ఒక ఊపు ఆమె ఊపేసింది. కాగా ఇపుడు బ్రెట్నీ స్పియర్స్ నుంచి ఓ షాకింగ్ అండ్ ఊహించని అనౌన్సమెంట్ ఐతే వార్తల్లోకి వచ్చింది.

కాగా ఈ పాపులర్ పాప్ సింగర్ తనని తానే పెళ్లాడినట్టుగా అనౌన్స్ చేసి తన సెల్ఫ్ మ్యారేజ్ పై పోస్ట్ చేసింది. నన్ను నేనే పెళ్లి చేసుకున్నాను ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు లేదా స్టుపిడ్ గా అనిపించవచ్చు కానీ నేను చేసిన పనుల్లో ఇదే అతి తెలివైన పని అనుకుంటున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీనితో తన షాకింగ్ డెసిషన్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా వైరల్ అయ్యింది.

అయితే 42 ఏళ్ల బ్రెట్నీ స్పియర్స్ కి ముందు పెళ్లి కాలేదా అంటే ఇన్నేళ్ళలో ఆమెకి పెళ్లి జరిగింది అది కూడా ఒకటి రెండు సార్లు కూడా కాదు మొత్తం మూడు సార్లు ఈమె పెళ్లి చేసుకుంది. జాసన్ అలెన్ అలెగ్జండర్ అనే అతన్ని 2004 లో పెళ్లి చేసుకొని ఏడాది లోపే విడిపోయింది. మళ్ళీ అదే 2004 లో కెవిన్ ఫెడెర్లైన్ అనే అతన్ని చేసుకొని 2007 వరకు కలిసి ఉంది.

Britney Spears married for 4th time her self with a twist

ఆ తర్వాత మళ్ళీ 15 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 2022 లో సామ్ అస్గరి అనే అతన్ని పెళ్లి చేసుకొని ఈ ఏడాది 2024 వరకు కలిసి ఉంది.. ఇలా తన ముగ్గురు మాజీ భర్తలకు విడాకులు ఇచ్చి ఫైనల్ గా తనని తానే స్వయం వివాహమాడి ఊహించని విధంగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. మరి ఆమె తీసుకున్న ఈ వింత నిర్ణయం చూసి చాలా మంది షాకవుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఆమె తనకి కూడా విడాకులు ఇచ్చుకొని వేరే అతని ఐదో పెళ్లి చేసుకుంటుంది ఏమో...

More from Filmibeat

Read more about: pawan kalyan britney spears jalsa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X