Jaanavule: రెండోది కూడా అదిరింది BRO.. ఆమెతో మెగా హీరో రొమాంటిక్‌గా!
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ సినిమాలే ఆరంభం నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకున్నాయి. అలాంటి వాటిలో మెగా హీరోల కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమానే 'బ్రో (BRO)'. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్' చిత్రానికి ఇది రీమేక్‌గా వస్తుంది. డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని క్రేజీగా తెరకెక్కిస్తున్నారు.
పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలయికలో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీని ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.. టాకీ పార్టును ఎవరు ఊరించనంత వేగంగా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా ప్రచారంపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్‌తో పాటు మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల చేశారు.

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'బ్రో (BRO)' మూవీలోని రెండో పాటను చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ - కేతిక శర్మ నడుమ సాగే 'జానవులే' పాటను థమన్ కంపోజ్ చేయడంతో పాటు ప్రణతితో కలిసి ఆలపించాడు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇచ్చారు. ఇక, ఈ పాట సాగిన విధానం, కనిపించిన లొకేషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. దీంతో ఈ పాటకు అతి తక్కువ సమయంలోనే మంచి స్పందన లభిస్తోంది.
మెగా హీరోలు కలిసి చేస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











