BTS 5 గంటల్లో 1 కోటి ఫాలోవర్స్.. పాప్ గాయకుడు సరికొత్త రికార్డు.. రెండు గిన్నీస్ బుక్ రికార్డులతో హల్‌చల్
దక్షిణ కొరియా గాయకుడు, ప్రపంచవ్యాప్తంగా తమ మ్యూజిక్ ప్రతిభతో పాపులారిటీని సొంతం చేసుకొన్న బీటీఎస్ బృందంలోని సభ్యుడు V అలియాస్ కిమ్ తే యంగ్ అరుదైన రికార్డులను సొంతం చేసుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న బీటీఎస్ టీమ్ ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లోకి ప్రవేశించారు. ఈ టీమ్‌లోని ప్రతీ ఒక్క సభ్యుడు ఇన్స్‌టాగ్రామ్‌లో తమ వ్యక్తిగత అకౌంట్లను ఓపెన్ చేయగా.. అత్యధిక ఫాలోవర్స్ రావడం రికార్డుగా మారింది. ఆ రికార్డుకు సంబంధించిన విషయాల్లోకి వెళితే..

ఏడుగురు బృందంతో బీటీఎస్
దక్షిణ కొరియా దేశానికి చెందిన ఏడుగురితో కూడిన బృందంలో ఆర్ఎమ్, జిన్, సుగా, జే-హోప్, జమిన్, వీ అండ్ జంగ్‌కుక్ ఉన్నారు. ఏడుగురు కలిసి 2010లో దక్షిణ కోరియన్ బాయ్ బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 2013లో బిగ్ హిట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

డిసెంబర్ 6వ తేదీన ఇన్స్‌టాగ్రామ్‌లోకి
BTS బ్యాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు అభిమానులుగా మారిపోయారు. అశేషంగా సంపాదించుకొన్న తమ అభిమానులను ఇన్స్‌టాగ్రామ్ ఫాలోవర్స్‌గా మార్చేందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు. డిసెంబర్ 6వ తేదీన బీటీఎస్ టీమ్ తమ అకౌంట్లను ఓపెన్ చేశారు.

5 గంటల్లోపే 1 కోటి ఫాలోవర్స్
బీటీఎస్ బ్యాండ్ సభ్యులు ఇన్స్‌టాగ్రామ్‌లోకి ప్రవేశించిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నారు. V అలియాస్ కిమ్ తే యంగ్ అకౌంట్‌కు మంచి స్పందన లభించింది. కేవలం 43 నిమిషాల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నారు. అంతటితో కిమ్ ప్రభంజనం ఆగలేదు. కేవలం 4 గంటల 52 నిమిషాల్లోనే 1 కోటి ఫాలోవర్స్‌ను సాధించారు. దాంతో అత్యంతవేగంగా ఫాలోవర్స్ సంపాదించుకొన్న కిమ్ తే యంగ్ పేరిట రెండు గిన్నీస్ బుక్ రికార్డులు నమోదయ్యాయి.

బీటీఎస్ బృందానికి ఊహించిన రెస్పాన్స్
బీటీఎస్ బృందంలో కిమ్ మినహాయిస్తే.. మిగితా ఆరుగురు సభ్యుల ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లకు భారీ స్పందన లభించింది. ఆర్ఎం అలియాస్ కిమ్ నంజూన్ కూడా భారీగా ఫాలోవర్స్ లభించారు. వారు పెట్టిన పోస్టులకు లక్షల్లో లైకులు రావడం గమనార్హం. దీనిని బట్టి వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో స్పష్టమైంది.

బీటీఎస్ ఆల్బమ్స్ ఇలా..
బీటీఎస్ బృందం ఇటీవల రూపొందించిన డైనమెట్ ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభించడంతోపాటు అమెరికన్ బిల్‌బోర్డ్ హాట్ 100లో, అలాగే గ్రామీ అవార్డులకు నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి వారిని ఆకర్షించింది. ఇటీవల వారు రూపొందించిన డార్క్ అండ్ వైల్డ్ (2014), వింగ్స్ (2016), లవ్ యువర్ సెల్ఫ్(2018), మ్యాప్ ఆఫ్ ది సోల్ (2020), వేక్ అప్ (2014), యూత్, ఫేస్ యువర్ సెల్ఫ్ (2018) ఆల్బమ్ బహుళ ప్రాచుర్యం పొందాయి.
బీటీఎస్ బ్యాండ్‌లో ఏడుగురు సభ్యులు ప్రపంచ సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. లాస్ ఎంజెలెస్‌లో ఇటీవల నిర్వహించిన సంగీత కార్యక్రమం కోసం దాదాపు 214000 టికెట్లు అమ్ముడు పోగా, 33.3 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం రూపాయల్లో లెక్కిస్తే.. సుమారు 250 కోట్ల రూపాయలకుపైనే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రాత్రుల పాటు జరిగిన ఈ షో కోసం ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.


Click it and Unblock the Notifications











