BTS's Butter Sensation: మే 21న సంగీత ప్రపంచంలో సునామీ.. వైరల్‌గా బటర్ టీజర్!
ప్రపంచ మ్యూజిక్ రంగంలో కొద్ది సంవత్సరాలుగా అలజడి సృష్టిస్తున్న BTS (Bangtan Boys) టీమ్ మరో పాప్ ఆల్బమ్‌తో సంగీత అభిమానుల ముందుకు రానున్నది. వారు రూపొందిస్తున్న ఆల్బమ్స్‌కు అత్యంత ప్రేక్షకాదరణ పొందడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటింటికి చేరువ అవుతున్నారు. అయితే వారు తాజాగా రూపొందించిన బటర్ మ్యూజిక్ ఆల్బమ్ గురించి, వారి గురించి మరిన్నీ వివరాలు..

బ్యాక్ స్ట్రీట్ బాయ్ తర్వాత
గతంలో వరల్డ్ మ్యూజిక్‌లో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా వారికి విశేష ఆదరణ దక్కింది. 1993లో ఈ టీమ్ అనూహ్యంగా సంగీత ప్రపంచంలోకి దూసుకొచ్చింది. బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ (1996), మిలినీయం (1999), నెవర్ గాన్ (2005), అన్ బ్రేకబుల్ (2007) లాంటి ఆల్బమ్స్ సంగీత అభిమానులను ఉర్రూతలూగించాయి. వారి దారిలోనే ఇప్పుడు బీటీస్ పెను సంచలనం సృష్టిస్తున్నారు.

సంగీత ప్రపంచంలో సునామీ..
దక్షిణ కొరియా దేశానికి చెందిన ఏడుగురితో కూడిన బృందంలో ఆర్ఎమ్, జిన్, సుగా, జే-హోప్, జమిన్, వీ అండ్ జంగ్‌కుక్ ఉన్నారు. ఏడుగురు కలిసి 2010లో దక్షిణ కోరియన్ బాయ్ బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 2013లో బిగ్ హిట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

డైనమెట్‌కు విశేష ఆదరణ
తాజాగా సంగీత ప్రపంచంలోకి దూసుకొచ్చిన బీటీఎస్ తాము రూపొందించిన డైనమెట్ ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభించడంతోపాటు అమెరికన్ బిల్‌బోర్డ్ హాట్ 100లో, అలాగే గ్రామీ అవార్డులకు నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి వారిని ఆకర్షించింది. ఇటీవల వారు రూపొందించిన డార్క్ అండ్ వైల్డ్ (2014), వింగ్స్ (2016), లవ్ యువర్ సెల్ఫ్(2018), మ్యాప్ ఆఫ్ ది సోల్ (2020), వేక్ అప్ (2014), యూత్, ఫేస్ యువర్ సెల్ఫ్ (2018) ఆల్బమ్ బహుళ ప్రాచుర్యం పొందాయి.
వైరల్‌గా బటర్ సాంగ్ టీజర్
డైనమెట్ ఆల్బమ్‌తో సంచలనం రేపిన బీటీఎస్ టీమ్ ఇప్పుడు బటర్ అనే ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో RM, Jin, SUGA, J-hope, Jimin, V, Jungkook ప్రొఫెషనలిజంతోపాటు అద్భుతంగా డ్రెస్సింగ్ చేసుకొని ఆకట్టుకొంటున్నారు. ఈ పాట మే 21వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











