twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    BTS రికార్డు కలెక్షన్లు.. లాస్ ఎంజెలెస్‌లో షోకు వందల కోట్ల వర్షం

    |

    సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న దక్షిణా కోరియాకు చెందిన పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ BTS మరో రికార్డు సృష్టించింది. కరోనావైరస్ కారణంగా సంగీత విభావరి నిర్వహించలేకపోయిన ఈ పాపులర్ బ్రాండ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో తొలి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. దీంతో సంగీత అభిమానుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ షో కోసం కొనసాగించిన టికెట్ల అమ్మకాలకు బ్రహ్మండమైన రెస్సాన్స్ లభించింది.

    BTS sold 214,000 tickets over 33.3 million dollars in Los Angeles live concert

    బీటీఎస్ బ్యాండ్‌లో ఏడుగురు సభ్యులు ప్రపంచ సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ బ్యాండ్‌లో ఆర్ఎం, జిన్, సుగా, జే హోప్, జిమిన్, వీ, జంగ్ కుక్ ఉన్నారు. లాస్ ఎంజెలెస్‌లో నవంబర్ 27, 28, డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన సంగీత కార్యక్రమం కోసం దాదాపు 214000 టికెట్లు అమ్ముడు పోగా, 33.3 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం రూపాయల్లో లెక్కిస్తే.. సుమారు 250 కోట్ల రూపాయలకుపైనే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాలుగు రాత్రుల పాటు జరిగిన ఈ షో కోసం ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

    అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ బిల్‌బోర్డ్ స్వయంగా ఈ కలెక్షన్ల వివరాలను వెల్లడించింది. రెండేళ్ల తర్వాత లాస్ ఎంజెలెస్‌లోని సోఫి స్టేడియంలో బీటీఎస్ బ్యాండ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో భారీగా స్పందన వచ్చింది. నాలుగు రోజుల్లో సంగీత అభిమానులు తమ ఫేవరేట్ మ్యూజిషియన్స్‌ను సంతోషంలో మునిగిపోయారు.

    బీటీఎస్ గ్రూప్ నిర్వహించిన సంగీత కార్యక్రమాలకు అమెరికాలో టాప్ సెలబ్రిటీలు పోటెత్తారు. ఫైనల్ రోజున కోల్డ్ ప్లే ఆల్బమ్ రూపొందించిన క్రిస్ మార్టిన్ హాజరై అందర్నీ ఆశ్చర్య పరిచారు. అయితే ఇటీవల కోల్డ్ ప్లేలోని మై యూనివర్స్‌ పాటను బీటీఎస్ ప్రమోట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిస్ బీటీఎస్ షోకు హాజరైనట్టు చెప్పారు.

    English summary
    Popular South Korean boy band BTS sold 214,000 tickets over 33.3 million dollars in Los Angeles live concert.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X