‘రంగ్ దే’ సాంగ్ రేపే.. బస్టాండే అంటూ ఆసక్తి రేపుతోన్న నితిన్
నితిన్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. నేడు విడులైన చెక్ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్, రివ్యూలతో చెక్ సినిమా పాస్ అయిపోయింది. అయితే ఇక కమర్షియల్‌గా ఏ మాత్రం వర్కవుట్ అవుతుంది.. బాక్సాఫీస్ వద్ద చెక్ ఫలితం ఏంటన్నది ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు చెక్ సినిమా పని అయిపోయింది. ఇన్ని రోజులు చెక్ ప్రమోషన్స్ కోసం నితిన్ ఫుల్ బిజీగా ఉంటూ వచ్చాడు.
ఇకపై నితిన్ తన ఫోకస్‌ను రంగ్ దే సినిమాపై పెట్టినట్టు కనిపిస్తోంది. వచ్చే నెల విడుదల కాబోతోన్న రంగ్ దే సినిమా షూటింగ్ గతవారమే పూర్తయింది. అయితే ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ పెంచే పనిలో పడింది. అందులో ఓ భాగంగా ఓ పాటను వదలలాని ఫిక్స్ అయింది. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. నితిన్ పెళ్లి సందర్భంగా వదిలిన చిన్న వీడియో అందరనీ ఆకట్టుకుంది.

అయితే తాజాగా మరో పాటను వదిలి.. సినిమాపై అంచనాలు పెంచేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో బస్టాండే బస్టాండే అనే లిరికల్ వీడియోను రేపు విడుదల చేసేందుకు టైంను ఫిక్స్ చేసేసుకుంది. రేపు ఉదయం 10 08 గంటలకు లిరికల్ వీడియో విడుదల కాబోతోందంటూ మేకర్స్ ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై వస్తోన్న ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. మార్చి 26న ఈ మూవీ విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











