అల వైకుంఠపురంలో మూవీ మరో అరుదైన రికార్డు.. సంతోషంలో పూజా హెగ్డే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం హావా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇంకా అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో సందడి చేస్తున్నాయి. తాజాగా 2020లో యూట్యూబ్‌లో సందడి చేసిన మ్యూజిక్ వీడియోల జాబితా బయటకు వెల్లడించారు. ఈ టాప్ 10 జాబితాలో అల వైకుంఠపురంలో చిత్రానికి రెండుస్థానాలు దక్కాయి.

2020లో యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్ సాధించిన పాటల్లో బుట్ట బొమ్మ పాట మూడోస్థానంలో నిలిచింది. అలాగే ఈ చిత్రంలోని మరో పాట రాములో రాములా పాట 8వ స్థానంలో నిలువడం విశేషంగా మారింది.

Butta Bomma and Ramuloo Ramulaa in Youtube Indias Top 10 Music Videos of 2020

ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ ట్వీట్ చేస్తూ.. బుట్టబొమ్మ, రాములో రాములా పాటలు 2020లో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాయి. టాప్ 10 మ్యూజిక్ వీడియోలో రెండు స్థానాలను ఈ సినిమా సాధించింది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

గీతా ఆర్ట్స్ ట్వీట్‌పై స్పందిస్తూ.. 10లో రెండు స్థానాలు రావడం గొప్పగా ఉంది. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఫ్లాట్‌ఫాంలో ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప అనుభూతిని పంచిన ఫ్యాన్స్ థ్యాంక్స్ అని పూజా హెగ్డే ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X