twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బుట్టబొమ్మ’కు మరో ఘనత.. సోషల్ మీడియాలో వైరల్

    |

    ఇప్పుడు కరోనా వైరస్ ఎంతగా ఫేమస్సో.. అంతకు ముందు అల వైకుంఠపురములో సినిమా, బుట్టబొమ్మ పాట అంతగా ఫేమస్ అయింది. ఎక్కడ చూసినా సరే బుట్టబొమ్మకు సంబంధించిన క్లిప్స్ కనిపించేవి. ఇక టిక్ టాక్ వంటి యాప్‌లో అయితే బుట్టబొమ్మది ఓ చరిత్రే. బుట్టబొమ్మ ఖ్యాతి ఖండాలను దాటిపోయింది. ఆస్ట్రేలియాలోనూ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేస్తున్నారంటే ఎంతగా క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

    తాజాగా బుట్టబొమ్మ ఖాతాలో ఓ కొత్త రికార్డ్ వచ్చి చేరింది. యూట్యూబ్‌లో బుట్టబొమ్మ సృష్టించిన సంచలనాలు అందరికీ గుర్తుండే ఉంటుంది. యూట్యూబ్ హిస్టరీలో ప్రపంచ వ్యాప్తంగా వంద పాటలను ఓ లిస్ట్‌గా తీస్తే అందులో 15వ స్థానంలో బుట్టబొమ్మ వచ్చింది. ఇక యూట్యూబ్‌కు నిద్ర పట్టకుండా చేసిన బుట్టబొమ్మ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతూనే ఉంది.

    Butta Bomma Video Song Crossed 260 million

    తాజాగా బుట్టబొమ్మ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఇంత వరకు 260 మిలియన్ల వ్యూస్, రెండు మిలియన్ల లైకులు సాధించిన తెలుగు పాటగా బుట్టబొమ్మ కొంగొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బుట్టబొమ్మ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ మేరకు తమన్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పాట పాడిన అర్మాన్ మాలిక్, రాసిన రామ జోగయ్య శాస్త్రికి, అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇలా అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

    English summary
    Butta Bomma Video Song Crossed 260 million. #ButtaBomma emerges as the Most Viewed Telugu Video Song Ever on YouTube. Racing Towards 2M Likes Mark It will become First Ever 2M Liked Telugu video/ Video song on YouTube
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X