క్షణాల్లో ట్రెండింగ్‌లోకి.. బుట్టబొమ్మ వీడియో సాంగ్ వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురుములో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందే అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. వంద మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని తొలి పాటగా సామజవరగమన, రెండో పాటగా రాములో రాముల ఇలా యూట్యూబ్‌ను షేక్ చేసింది.
లిరికల్ వీడియోలే ఈ రేంజ్‌లో హిట్ కావడంతో.. వాటిని అంతకుమించిన స్థాయిలో విజువల్‌గా చిత్రీకరించారు. ఒక్కో పాటను ఒక్కో రకంగా చిత్రీకరించడం బన్నీ స్టైల్, గ్రేస్, స్టెప్పులు ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సామజవరగమన, ఓ మై గాడ్ డ్యాడీ పాటలు వచ్చేశాయి. తాజాగా బుట్టబొమ్మ కూడా వచ్చేసింది.

అల వైకుంఠపురములో సినిమాలోని అన్ని పాటలు వేటికవే ప్రత్యేకమే. అన్నింటిలోనూ బుట్టబొమ్మకు వచ్చిన క్రేజ్, పాపులార్టీ వేరే. అందులో బన్నీ గ్రేస్, స్టైలీష్ స్టెప్పులు అందర్నీ ఫిదా చేశాయి. ఇక టిక్ టాక్ వంటి యాప్‌లో ఆ స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన బుట్టబొమ్మ వీడియో సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











