‘బుట్ట బొమ్మ’కు అరుదైన గౌరవం: దశాబ్ధంలోనే ఉత్తమ పాటగా ఎంపిక.. అవార్డు అందుకున్న స్టార్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు.. కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్ము దులిపేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి భారీ పోటీని తట్టుకుని మరీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు రాబట్టింది. దీంతో 'బాహుబలి' తర్వాత భారీ స్థాయిలో వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా 3.5 మిలియన్ మార్కును దాటేయడం విశేషం.
'అల.. వైకుంఠపురములో'లోని పాటలు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి. ఇందులోని 'బుట్ట బొమ్మ', 'రాములో రాములా', 'సామజవరగమన' అనే పాటలు భారీ స్థాయిలో వ్యూస్‌ను సాధించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. తద్వారా ఇది బెస్ట్ ఆల్బమ్‌గా కితాబందుకుంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న 'బుట్ట బొమ్మ' సాంగ్.. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఈ దశాబ్ధంలో ఎక్కువ వైరల్ అయిన పాటల జాబితాలో దీనికి తాజాగా ఓ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని సింగర్ వెల్లడించాడు.

పాటలకు సంబంధించి 'మిర్చి మ్యూజిక్ అవార్డులు' కొంత ప్రత్యేకమైనవనే చెప్పాలి. ప్రతి ఏడాది ఈ సంస్థ విజేతలను ప్రకటించి.. వాళ్లను అవార్డులతో గౌరవిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దశాబ్ధ కాలానికి ఉత్తమ పాటలను ఎంపిక చేశారు. ఇందులో 'మోస్ట్ వైరల్ సాంగ్ ఆఫ్ ది డికేడ్'గా 'బుట్ట బొమ్మ' పాట నిలిచింది. ఈ విషయాన్ని దాన్ని ఆలపించిన అమ్రాన్ మాలిక్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తనకు దక్కిన అవార్డును చూపిస్తూ.. సంగీతం సమకూర్చిన థమన్‌కు, లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే, చిత్ర యూనిట్‌కూ థ్యాంక్స్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











