2020లో టాలీవుడ్ నెంబర్ వన్ సాంగ్.. దుమ్ములేపిన బుట్టబొమ్మ
టాలీవుడ్‌లో అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. నేటికి ఈ మూవీ ఎక్కడో ఏదోలా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. అల వైకుంఠపురములో సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2020 సంక్రాంతి వసూళ్లలో అల వైకుంఠపురములో సినిమాదే అత్యధిక భాగం. బాక్సాఫీస్ లెక్కలు అలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం నేటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటోంది.
అల వైకుంఠపురములో ఆల్బమ్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. టిక్ టాక్‌లో బుట్టబొమ్మ పాట ఖండాంతరాలు దాటింది. బుట్టబొమ్మ స్టెప్పులు, ఆ పాట యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఎక్కడ చూసిన అల వైకుంఠపురములో పాటలే వినిపించేవి. యూట్యూబ్ ఇండియా లెక్కలు బయటకు తీస్తే.. అందులో బుట్టబొమ్మ టాప్ 3లో స్థానాన్ని సంపాదించుకుంది. రాములో రాముల పాట పదో స్థానాన్ని ఆక్రమించింది. తాజాగా అమెజాన్ మ్యూజిక్‌లోనూ అల వైకుంఠపురములో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

అమెజాన్ మ్యూజిక్‌లో టాలీవుడ్ నుంచి అత్యధిక మంది విన్న సాంగ్‌గా బుట్టబొమ్మ కొత్తరికార్డును క్రియేట్ చేసింది. బుట్టబొమ్మ తరువాత.. నీలి నీలి ఆకాశం, మైండ్ బ్లాక్, నీ కన్ను నీలి సముద్రం, లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటలు వరుసగా ఉన్నాయి. మొత్తానికి అన్ని చోట్లా అల వైకుంఠపురములో సినిమా పాటలు ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి. సావన్, స్పాటిఫై వంటి యాప్‌ల్లోనూ అల వైకుంఠపురములో పాటలు అదరగొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











