రికార్డులన్నీ బుట్టబొమ్మ ఖాతాలోనే.. తమన్ మ్యానియా మూములుగా లేదు
అల వైకుంఠపురుములో పాటలు విడుదలై ఏడాది కావొస్తుంది. సినిమా సంక్రాంతికి వచ్చింది. రికార్డులన్నీ తన ఖాతాలోనే వేసేసుకుంది. బాక్సాఫీస్ లెక్కలు పూర్తయ్యాయి. కానీ సోషల్ మీడియాలో రికార్డులు, వాటి లెక్కలు మాత్రం ఇంకా తేలడం లేదు. రోజుకో రకమైన రికార్డులను అల వైకుంఠపురములో కొట్టేస్తోంది. ముఖ్యంగా బుట్టబొమ్మ అన్నింటా ముందుంటుంది. రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తోంది.
తమన్ కొట్టిన అల వైకుంఠపురములో ఆల్బమ్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. టిక్ టాక్‌లో బుట్టబొమ్మ పాట ఖండాంతరాలు దాటింది. బుట్టబొమ్మ స్టెప్పులు, ఆ పాట యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇక యూట్యూబ్ ఇండియా విభాగంగా లెక్కలు బయటకు తీస్తే.. అందులో బుట్టబొమ్మ టాప్ 3లో స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమెజాన్ మ్యూజిక్‌లోనూ బుట్టబొమ్మ దుమ్ములేపింది. మొదటి స్థానాన్ని ఆక్రమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు జియో సావన్ యాప్‌లోనూ బుట్టబొమ్మ దుమ్ముదులిపింది. టాలీవుడ్ టాప్ సాంగ్‌గా జియో సావన్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. బుట్టబొమ్మ పాటను 50.3 మిలియన్ల మంది విన్నారు. ఇక ఆ తరువాత సామజవరగమన (41.5), రాములో రాముల (34.3), నీలి నీలి ఆకాశం (29.9), నీ కన్ను నీలి సముద్రం (25.2) మిలియన్లతో టాప్ 5 పాటలుగా రికార్డులు క్రియేట్ చేశాయి. ఇందులో మొదటి మూడు స్థానాల్లో అల వైకుంఠపురములో పాటలే ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











