అల.. వైకుంఠపురములో: బుట్టబొమ్మ సాంగ్ టీజర్ విడుదల
సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకలోకంలో ఊపుతెప్పించేందుకు పకడ్బందీగా సన్నద్దమయ్యాడు. ఈ మేరకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్ ద్వారా అభిమానుల్లో ఉన్న ఆతృతను రెట్టింపు చేస్తున్నాడు.
ఇప్పటివరకు 'అల.. వైకుంఠపురములో' సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌తో తనదైన శైలిలో మ్యాజిక్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో అల్లు అర్జున్. ఫస్ట్‌లుక్ మొదలుకొని ఇచ్చిన అన్ని అప్‌డేట్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సంక్రాంతి రేస్‌లో 'అల.. వైకుంఠపురములో' సినిమాదే హవా అనే టాక్ తెప్పించారు.
ఇదే బాటలో తాజాగా ఈ సినిమా నుంచి బుట్టబొమ్మ సాంగ్ టీజర్ రిలీజ్ చేసి మ్యూజిక్ లవర్స్‌ని రంజింపజేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పై అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట ప్రోమో సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ డిసెంబర్ 24న విడుదల చేయనున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











