twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ బన్నీ.. వంద మిలియన్ల బుట్టబొమ్మ.. యూట్యూబ్‌లో రికార్డుల మోత

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ చిరకాల వాంఛ అయిన ఇండస్ట్రీ హిట్‌ను ఈ సినిమాతో తీర్చేసుకున్నాడు. కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు.. సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో చిత్రం చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.

    Recommended Video

    Buttabomma Video Song Crossed 100 Million Views | Viral In TikTok As well
     సంగీతం ఓ సెన్సేషన్..

    సంగీతం ఓ సెన్సేషన్..

    అల వైకుంఠపురములో ఇంతటి సెన్సేషనల్ హిట్‌గా నిలవడంలో తమన్ అందించిన సంగీతమే ముఖ్య పాత్రను పోషించింది. ఒక్కో పాట రిలీజ్ చేస్తూ ఉంటే.. సోషల్ మీడియా షేక్ అయింది. యూట్యూబ్‌కు నిద్ర పట్టకుండా చేసిన పాటలు ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

    వంద మిలియన్ల పాటలు..

    వంద మిలియన్ల పాటలు..

    తెలుగు నాట వంద మిలియన్ పాట చూడటమే గగనం అనుకున్న సమయంలో.. ఏకంగా రెండు పాటలు ఆ ఫీట్‌ను అందుకున్నాయి. అవి కూడా ఒకే చిత్రంలోనివి కావడం విశేషం. సామజవరగమన, రాములో రాముల పాటలు వంద మిలియన్ల పాటలుగా రికార్డులకెక్కాయి. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడా ఆ ఫీట్‌ను రీచ్ అయింది.

    ఇండియానే ఊపేసిన బుట్టబొమ్మ..

    ఇండియానే ఊపేసిన బుట్టబొమ్మ..

    బుట్టబొమ్మ ఆడియో పరంగా ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో.. విజువల్ పరంగానూ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బన్నీ స్టెప్పులకు ఇండియా మొత్తం ఊగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం బన్నీ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు.

    వంద మిలియన్ల సాంగ్..

    వంద మిలియన్ల సాంగ్..

    బుట్టబొమ్మ పాట ఎంతగా వైరల్ అయిందో టిక్ టాక్‌ను చూస్తే తెలుస్తుంది. దాదాపు 500 మిలియన్ల వీక్షణలు దక్కించుకుని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. మిలియన్ లైక్స్‌ను కూడా త్వరలోనే రీచ్ కానుంది.

    English summary
    Buttabomma Video Song Crossed 100 Million Views. Earlier Samajavaragamana, ramulo Ramula Song Reached This feat. Shilpa Shetty And Shamita Shetty Steps For Buttabomma Song. Ala Vaikunthapurramuloo Album Goes Viral On Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X