బుట్టబొమ్మ వీడియో సాంగ్ ప్రోమో.. పూజా హెగ్డే లుక్స్, బన్నీ స్టెప్స్ వైరల్
అల వైకుంఠపురములో చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వీటన్నంటికి ఓ కారణమైతే.. తమన్ అందించిన సంగీతం, పాటలు మరో కారణం. సినిమా విడుదలకు ముందే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కారణం.. అల వైకుంఠపురములో ఆల్బమ్. సామజవరగమన, రాములో రాముల, ఓ మై గాడ్ డాడీ, బుట్టబొమ్మ పాటలు సోషల్ మీడియాను ఎంతగా షేక్ చేశాయో, చేస్తున్నాయో అందరికీ తెలిసిందే.
పాటలు, లిరికల్ వీడియోలు ఎన్ని వ్యూస్‌ను సాధించాయో ఇంకా అప్రతిహతంగా దూసుకుపోతున్నాయో తెలిసిందే. ఇప్పటికే సామజవరగమన, రాములో రాముల పాటలు వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసేశాయి. సామజ వరగమన వీడియో ప్రోమోను విడుదల చేయగా అది కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆ వీడియోలోని విజువల్స్, బన్నీ స్టెప్పులు, పూజా అందాలు అందర్నీ ఆకట్టుకోగా.. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ ప్రోమో విడుదలైంది.

అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. వీడియో ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో బన్నీ స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. పూజా లుక్స్, స్టైలీష్ స్టార్ వేసిన స్టైలీష్ స్టెప్పులు ఇలా అన్నీ కలిసి బుట్టబొమ్మను ఆకట్టుకునేలా చేస్తోంది. టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











