రష్మిక ఫైర్‌బ్రాండ్ హీరోయిన్.. ఫుల్ మార్కెట్.. గీతా ఛలో ఆడియోలో సీ కల్యాణ్

గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'గీతా... ఛలో'. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో 'చమక్' పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో 'గీతా.. ఛలో' పేరుతో విడుదల చేస్తున్నారు.

ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను రామానాయుడు స్టుడియోలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు వీఎన్ ఆదిత్య, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్, బాలాజీ నాగలింగం తదితర ప్రముఖులు హాజరై పాటలను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.

C Kalyan in Geeta Chalo audio release: Rashmika Mandanna fire brand heroine

గీతా ఛలో సినిమా తొలి పాటను నిర్మాత వీఎన్ ఆదిత్య విడుదల చేయగా.. రెండో పాటను ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. అలాగే మూడో పాటను ప్రేమకథా చిత్రం-2 నిర్మాత సుదర్శన్ విడుదల చేశారు. నాలుగో పాటను శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. ఇక చివరి పాటను నిర్మాత బాలాజీ నాగలింగం విడుదల చేశారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ''మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. కానీ ఇంకో శ్రీనివాస్‌తో కలిసి ఈ రోజు ఒక మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం. 'గీతా.. ఛలో' టైటిల్ కూడా క్యాచీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా రిచ్‌లుక్ ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్‌ రష్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X