twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైనర్ బాలికను స్టేజీపైకి పిలిచి అభ్యంతరకంగా ప్రవర్తించిన సింగర్ వీడియో వైరల్!

    |

    కెనడియన్ రాపర్ డ్రాక్ మైనర్ బాలికతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది. మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా డ్రాక్... బాలికను స్టేజీపైకి పిలిచి ముద్దులతో ముంచెత్తాడు. అయితే ఈ వీడియో క్లిప్ ఇప్పటిది కాదని, 2010లో డెన్వర్‌లో చిత్రీకరించిందని తెలుస్తోంది. ఈ పాత క్లిప్ ఇపుడు వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అయింది.

    ఈ వీడియోలో డ్రాక్ మాట్లాడిన తీరు, ఆ అమ్మాయితో ప్రవర్తించిన విధానాన్ని కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం అతడు చాలా ఓవర్ చేశాడని, ఇలాంటి బిహేవియర్ తగదు అంటూ విమర్శలు గుప్పించారు.

    నేను ఇబ్బందుల్లో పడతాను అంటూనే...

    నేను ఇబ్బందుల్లో పడతాను అంటూనే...

    ఒక మైనర్ అమ్మాయితో ఇలా చేయడం వల్ల ఇబ్బందుల్లో పడతాను అంటూనే డ్రాక్... ఆ బాలికను ముద్దులతో ముంచెత్తడం, హగ్ చేసుకోడం గమనార్హం. అతడు అలా చేస్తుంటే ఆడియన్స్ అంతా విజిల్స్ వేస్తూ అతడిని మరింత ఉత్సహం పరిచారు.

    17 ఏళ్ల అమ్మాయి..

    17 ఏళ్ల అమ్మాయి..

    ఆ బాలిక సైతం తాను ఎంతగానో అభిమానించే రాప్ సింగర్ డ్రాక్ తనను స్టేజీపైకి పిలిచి అలా చేస్తుంటే ఆనందం పడిపోయింది. ఈ సందర్భంగా ఆమెను వయసు ఎంత అని అడగ్గా 17 ఏళ్లు అని సమాధానం ఇచ్చింది.

    జైలుకు వెళ్లనులే అంటూ సరదాగా..

    ఆ అమ్మాయి తన వయసు 17 సంవత్సరాలు అని చెప్పుడంతో... జైలుకెళ్లే అవకాశం అయితే లేదు అంటూ మరింత సరదాగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.

    వక్షోజాల ప్రస్తావనపై అభ్యంతరం

    వక్షోజాల ప్రస్తావనపై అభ్యంతరం

    అయితే డ్రాక్ ఆ అమ్మాయితో అలా సరదాగా ప్రవర్తించడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు కానీ... ఆమె వయసు, వక్షోజాల గురించి ప్రస్తావించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Canadian rapper Drake kissed a female fan onstage even after finding out that she is underage and told her, "I like the way your breasts feel against my chest." A video went viral where the 32-year-old rapper inviting a female fan on stage and flirting with her during the concert on Thursday. According to a YouTube user, it is said that the clip was filmed in 2010 in Denver, People reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X