హైప్ క్రియేట్ చేస్తున్న 'చావు కబురు చల్లగా' మాస్ సాంగ్.. హిట్టు కొట్టేలా ఉన్నారు
ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్స్ లు అందుకుంటున్న హీరోయిన్స్ లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అయితే అందంతో నటనలో ఈ హీరోయిన్ కు మంచి మార్కులే పడుతున్నాయి గాని బాక్సాఫీస్ వద్ద సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. ఇక ఈ సారి 'చావు కబురు చల్లగా సినిమాతో' హిట్ కొట్టేలా ఉందని అనిపిస్తోంది. ఆమెతో పాటు హీరో కార్తికేయ కూడా ఆ సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
ఇక సినిమాకు సంబంధించిన ఒక పాటను ఇటీవల రిలీజ్ చేయగా అది వైరల్ గా మారింది. మై నేమ్ ఈజు రాజు.. అంటూ సాగే ఆ టైటిల్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. సినిమాకు సంబంధించిన హీరో క్యారెక్టర్ ను చాలా వివరంగా చెబుతున్నట్లు అర్ధమవుతోంది. అప్పుడే ఆ సాంగ్ 1 మిలియన్ వ్యూవ్స్ ను అందుకొని సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు.

మార్చ్ 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఫన్నీ పోస్టర్ ద్వారా ఇటీవల తెలియజేశారు. అందులో హీరో కార్తికేయ బైక్ ముందు భాగంపై కూర్చొని ఉండగా లావణ్య త్రిపాఠి వెనకాల నవ్వుతూ కూర్చొని ఉంది. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా పెద్దగా పోటీ లేని సమయంలోనే రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరి స్టార్స్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











