వర్మ వెన్నుపోటుకు కౌంటర్ .. చంద్రోదయం సాంగ్ రిలీజ్

ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను రూపొందిస్తూ పాటలను విడుదల చెస్తున్న క్రమంలో .. ఇప్పుడు వర్మ కు, వెన్నుపోటు పాటకు కౌంటర్ గా "చంద్రోదయం" టీమ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. 'వెన్నుపోటు అని వాగే వాజెమ్మలు' అంటూ దర్శకుడు వెంకట రమణ రాసిన పాటకు షారుక్ సంగీతాన్ని సమకూర్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం" చంద్రోదయం"..ఈ బయోపిక్‌ను పీ వెంకటరమణ దర్శకత్వంలొ జీజే రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుంది అని
దర్శకుడు వెంకటరమణ అన్నారు.

ఆకులు ఎన్ని కాల్చిన బొగ్గులు కావు బ్రదర్ . జిత్తులమారి నక్కలు , తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు అల్లుడే " అనే లిరిక్‌తో పాటను విడుదల చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలొనె ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాం అని తెలిపారు.

Chandrababu Biopic Chandrodayam song released

సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్దాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నాం. నారా వారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ లాంటి లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ చేశాం. మహా నాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు అనిదర్శకుడు వెంకటరమణ తెలిపారు.వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X