twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరి కళ్లు తెరిపించే ప్రయత్నం చేసిన ఉపాసన... ఈ వీడియో ఆల్భం చూశారా?

    |

    దాహంతో ఉన్న మనిషికి ఒక్క నీటి చుక్క కూడా బంగారం లాంటిదే. ప్రతి ఏటా సురక్షిత నీరు అందక 2 లక్షల మంది మరణిస్తున్నారు. నీటిని సేవ్ చేయండి, వృద్ధా చేయకండి అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కాంపెయిన్ మొదలు పెట్టారు.

    ఇందులో భాగంగా 'సేవ్ మదర్ ఎర్త్' పేరుతో ఆమె ఓ వీడియో ఆల్బం ప్రొడ్యూస్ చేశారు. రాపర్ రోల్ రైడ్, సింగర్ అనురాగ్ కులకర్ణితో కలిసి ఈ పాట ద్వారా ప్రజల్లోకి సేవ్ వాటర్ మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నీటిని దుర్వినియోగం చేస్తున్నారండీ.. నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ ఈ పాట ద్వారా గుర్తు చేస్తున్నారు.

    Check out Save Mother Earth Song featuring Upasana, Roll Rida, Anurag Kulkarni

    ఈ ప్రపంచం మొత్తం నీటి ఆధారంగానే నడుస్తుంది. కానీ మనం ఆ విలువైన నీటిని దుర్వినియోగం చేస్తున్నాం. బోర్లు వేసి పాతాళం నుంచి నీటిని లాగి భూమిని పాడుచేయడం కంటే వర్షం నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ పాట ద్వారా తెలిపారు. నీటిని కాపాడితే నీ ఇల్లును కాపాడినట్లే.. భూమి ఎండిపోతే మన స్టోరీ ఎండ్ అయినపోయినట్లే... ఈ మాట వినకపోతే వినపడానికి నువ్వు ఉండవు అంతే అంటూ ఇందులో లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

    వీడియో చివర్లో... ఎక్కువ నీటితో పండించే రైస్ తినడం మానేసి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు(మిల్లెట్స్)వైపు మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నీటిని సేవ్ చేయడానికి ఇదొక మంచి మార్గం. ఈ చిన్న మార్పు వల్ల పెద్ద లాభం కలుగుతుంది.... అని ఉపాసన చెప్పుకొచ్చారు. చివర్లో మిస్టర్ సి (రామ్ చరణ్)కు స్పెషల్ థాంక్స్ కార్డ్ వేయడం గమనార్హం. వీడియోలో ఓ సీన్లో కనిపించే చేతులు రామ్ చరణ్ చేతులే అని అంటున్నా ఫ్యాన్స్.

    English summary
    Water Crisis in India is the major problem. Save Mother Earth Song An Intiative and Produced by Upasana Kamineni Konidela.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X