Laahe Laahe.. అదిరిపోయిన సర్ ప్రైజ్.. ఇద్దరు భామల రచ్చ.. చిరు స్టెప్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతోన్న ఆచార్య చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌కు ఈ మూవీ ప్రత్యేకం కాబోతోంది. ఇలా ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దాదాపు 13, 14 ఏళ్ల తరువాత మణిశర్మ చిరు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

అదిరిపోయే కాంబో..
మణిశర్మ చిరంజీవి కాంబో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉర్రూతలూగించే మాస్ పాట అయినా..రొమాంటిక్ మెలోడీ అయినా సరే చిరు తన గ్రేస్‌తో అదరగొట్టేస్తుంటాడు. అలాగే మణిశర్మ సైతం చిరు స్టైల్‌ను దృష్టిలో పెట్టుకుని సంగీతాన్ని అందిస్తుంటాడు.

ఆచార్యపై అలా..
ఇక చాలా గ్యాప్ తరువాత చిరంజీవి మ్యూజిక్ కొట్టబోతోన్న మణిశర్మ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. కమర్షియల్ అంశాలను ఏ మాత్రం మిస్ కాకుండా చూసుకునే కొరటాల శివ అద్బుతమైన సన్నివేశాలను మణిశర్మకు ఇచ్చినట్టు టాక్. వాటికి తగ్గట్టు మణిశర్మ కొట్టి పారేశాడని తెలుస్తోంది.
శాంపిల్‌గా అలా..
మణిశర్మ ఆచార్య కోసం ఎలాంటి పాటలు కొట్టి ఉంటాడా? అని అందరూ అనుకుంటున్న తరుణంలో లాహే లాహే పాట అప్డేట్ వచ్చింది. నిన్న వదిలిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. చిరు గ్రేస్, స్టైల్‌కు తగ్గట్టు వేసిన ఆ స్టెప్పులు, మణిశర్మ కొట్టిన ఆ ట్యూన్ అదిరిపోయింది. చిన్న ప్రోమోకు ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.

తాజాగా పాట..
తాజాగా లాహే లాహే పాట విడుదలైంది. అందరికీ ఓ సర్ ప్రైజ్‌లా ఇద్దరు హీరోయిన్లు కనిపించారు. ఒకరు ఓల్డ్ హీరోయిన్ అయిన సంగీత. అయితే ఈ పాటలో సంగీత తన మ్యానరిజంతొ అదరగొడితే.. కాజల్ తన గ్లామర్‌తో కట్టి పడేసింది. ఇక చిరు తన దైన గ్రేస్‌తో సాంగ్ మొత్తం రచ్చ చేశారు. హారిక నారాయణ, సాహితి పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించాడు. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహారించాడు.


Click it and Unblock the Notifications











