Bhola Shankar: హుషారెత్తించే రెండో పాట.. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ డ్యాన్స్ చూశారా?
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం చెరగనిది. సుమారు 40 ఏళ్లుగా హవా చాటుతూ బాస్ అనిపించుకుంటున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్న ఆయన త్వరలో భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఇందులోని హుషారైనా రెండో సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ చిత్రం. బిల్లా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటనతో అలరించనుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా భోళా శంకర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఒక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాం జాం జజ్జనక అంటూ హుషారుగా సాగే పార్టీ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. మహరి స్వర సాగర్ స్వరాలు అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సింగర్ మంగ్లీ ఆలపించారు. అలాగే కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా చక్కని స్టెప్పులను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
పాటలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ వేసే స్టెప్పులు అలరించేలా ఉన్నాయి. ఈ పాటతో థియేటర్లలో ప్రేక్షకులకు మంచి హుషారు వచ్చేలా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











