Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా సర్ప్రైజ్.. సూపర్ హిట్టు ఈల కొట్టు.. చిరు బర్త్ డే ట్రీట్ అదిరిందిలే
Recommended Video
మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో వింతేమీ లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గతంలో కంటే ఎక్కువ హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిరు బర్త్ డే కానుకగా మెగా సర్ప్రైజ్ ఇచ్చాడు వరుణ్ తేజ్.
వాల్మీకి నుంచి ఐటెం సాంగ్
తన కొత్త సినిమా 'వాల్మీకి' నుంచి ''జర్రా.. జర్రా'' లిరికల్ వీడియోను చిరు బర్త్ డే కానుకగా కొద్ది సేపటి క్రితమే విడుదల చేశాడు వరుణ్. యువతను ఉర్రూతలూగించేలా ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మాస్ బీట్‌కి తోడు.. వరుణ్ తేజ్ హైట్, వెయిట్ ప్రస్తావన తెస్తూ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది ఈ లిరికల్ సాంగ్. ఇక ఈ వీడియో సాంగ్ ప్రోమోను ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు.
ఐటెం సాంగ్ అనగానే..
సాధారణంగా ఐటెం సాంగ్ అనగానే ఇంగ్లీష్ పాపనో లేక సీనియర్ గ్లామర్ హీరోయినో గుర్తుకు రావడం కామన్. కానీ అందుకు భిన్నంగా ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయాతీ అనే హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు హరీష్. ఈ అమ్మాయి అందాలు సాంగ్‌లో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. హీరో వరుణ్ తేజ్‌తో ఆమె చిందులు ఈలలు కొట్టిస్తున్నాయి. అంతకుముందు 'దేవి 2' చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించింది డింపుల్.
మెగా ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్
ఇప్పటికే విడుదలైన వాల్మీకి అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ఈ ఐటెం సాంగ్ కేక పుట్టిస్తోంది. వాల్మీకిలో వరుణ్ లుక్స్‌తో పాటు ఈ సాంగ్ మెగా ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ పాటతో చిరు బర్త్ డే ట్రీట్ అదిరిందిలే అంటున్నారు మెగా ఫ్యాన్స్.
వాల్మీకి మూవీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది 'వాల్మీకి' మూవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా వాల్మీకి రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 13 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.