Chiranjeevi's Boss Party Review ఊరమాస్‌తో ఊపేసిన మెగాస్టార్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యాజిక్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో దూకేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమా ప్రమోషన్ భాగంగా బాస్ పార్టీ పేరుతో తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ పాట ఎలా ఉందంటే?
1. బాస్ పార్టీ పాట ఇలా..
నువ్వు లుంగీ ఎత్తుకో.. ఎయ్
నువ్వు షర్ట్ ముడేసుకో.. ఎయ్..
నువ్వు కర్చీఫ్ కట్టుకో.. ఎయ్
బాసొస్తుండు.. బాసొస్తుండు..
నీవు లైట్లు వేసుకో.. ఎయ్
నువ్వు కలర్ మార్చుకో.. ఎయ్
నువ్వు సౌండ్ పెంచుకో.. ఎయ్
బాసొస్తుండు.. బాసొస్తుండు.. అంటూ స్వయంగా ఊరమాస్ లిరిక్స్‌తో దేవీ శ్రీ ప్రసాద్ రాసిన పాట జోష్‌తో సాగింది.

మాస్ బీట్‌తో దేవీ శ్రీ ప్రసాద్
ఇక సంగీతం విషయానికి వస్తే.. మాస్ బీట్‌తో ఆద్యంతం బాస్ పార్టీ సాంగ్ సాగింది. మధ్య మధ్యలో దేవీ శ్రీ ప్రసాద్ జోష్ పుట్టించేందుకు చేసిన అరుపులు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. బాస్ పార్టీ పాట కాబట్టి ఆ మాత్రం ఉండాలని అభిమానులు సర్దిపెట్టుకొనేలా ఉంది. మ్యూజిక్ మాత్రం మాస్ ఎలిమెంట్‌తో సాగింది.

మాస్ లుక్స్‌తో చిరంజీవి
ఇక బాస్ పార్టీలో చిరంజీవి మరోసారి మాస్ లుక్స్‌తో కనిపించాడు. చిరంజీవి స్టెప్పుల్లో కూడా గ్రేస్ కనిపించింది. లుంగీ, పూల చొక్కాతో వింటేజ్ లుక్‌తో ఇరుగదీశారు. ఇక చిరంజీవితో ఊర్వశి రటేలా మాస్ స్టెప్పులతో ఆలరించింది. ఈ పాటను భారీగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో షూట్ చేశారు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి
వాల్తేరు వీరయ్య మూవీలో బాస్ పార్టీ సాంగ్‌ను దర్శకుడు బాబీ, కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చిత్రీకరించిన తీరు బాగుంది. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ భారీ సెట్‌ను కళ్లు చెదిరేలా వేశాడు. ఈ పాట కోసం చిరంజీవి క్యాస్టూమ్స్‌ను సుస్మిత కొణిదెల డిజైన్ చేసింది. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫి, నిరంజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
పవన్ కల్యాణ్ సెట్స్‌లోకి
వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ పాట షూటింగ్ నడిచేటప్పుడు.. ఆ సెట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లడం విశేషంగా మారింది. పాట షూటింగు సమయంలో మెగాస్టార్ చిరంజీవితో కొంత సమయం గడిపారు. ఆ సమయంలో బాస్ పార్టీ పాటను పవన్ కల్యాణ్ చూసి.. దర్శకుడు బాబీకి ప్రశంసలు అందించారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో రవితేజ అతిథి పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











